Saturday, 20 November 2021

రాకీ భాయ్‌తో ఆమిర్ ఖాన్ పోటీ.. బాలీవుడ్ బాక్సాఫీస్‌పై పోరు

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ తన సినిమా అప్డేట్‌తో వచ్చాడు. ఏకంగా రాకీ భాయ్ మీదకే పోటీకి వచ్చేశాడు. లాల్ సింగ్ చద్దాతో ఆమీర్ ఖాన్ బరిలోకి దిగాడు. తాజాగా ఆమిర్ ఖాన్ తన సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించాడు. ఏప్రిల్ 14న ఆమిర్ ఖాన్ బరిలోకి దిగబోతోన్నాడు. అయితే అదే రోజును రాకీ భాయ్ ఎప్పుడో బుక్ చేసుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కేజీయఫ్ చాప్టర్ 2 విడుదల కాబోతోందని తెలిసినా కూడా ఆమిర్ ఖాన్ తన సినిమాను దించబోతోన్నాడు. ఆమిర్ ఖాన్ సినిమా మీద ఉత్తరాదిన భారీ అంచనాలే ఉన్నాయి. కానీ చాఫ్టర్ 2 మీద నేషనల్ వైడ్‌గా క్రేజ్ నెలకొంది. కేజీయఫ్ మొదటి పార్ట్ ఎంతటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కేవలం డబ్బింగ్ సినిమాగా విడుదలై కూడా దాదాపు యాభై కోట్లు కొల్లగొట్టినట్టు టాక్. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వాటికి తగ్గట్టుగానే చాప్టర్ 2ను రెడీ చేశాడు. ఈ సారి బాలీవుడ్ నుంచి సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి వారిని తీసుకున్నాడు. అలా హిందీ మార్కెట్ మీద కూడా చాప్టర్ 2 కన్నేసింది. కేవలం బాలీవుడ్ ప్రాజెక్ట్‌గానే మిగిలిపోనుంది. అందులో నాగ చైతన్య నటించినా కూడా అంతటి ప్రభావం ఉండదు. అలాంటిది ఇప్పుడు బాక్సాఫీస్ పోరులో ఏప్రిల్ 14న ఆమిర్ ఖాన్ గెలుస్తాడా? యశ్ గెలుస్తాడా? అన్నది చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30DoaJI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...