Friday, 26 November 2021

బిగ్‌బాస్ హోస్ట్ మారుతున్నారు... శ్రుతి హాస‌న్ మాత్రం కాదు.. మ‌రెవ‌రో తెలుసా?

రియాలిటీ షో బిగ్‌బాస్ హోస్ట్ మారుతున్నారా? అంటే అందులో ఏంటి డౌట్ అనే స‌మాధానం వ‌స్తుంది. అదేంటి వ‌చ్చే ఈ శ‌ని, ఆది వారాల్లో బిగ్‌బాస్ హౌస్‌లోని నాగార్జున అక్కినేని రావ‌డం లేదా? ఏంటి అనే సందేహం వ‌స్తుంది. అయితే మ‌నం ఇక్క‌డ మాట్లాడుకునేది తెలుగు బిగ్‌బాస్ గురించి కాదండోయ్.. త‌మిళ బిగ్‌బాస్‌ గురించి. తమిళ బిగ్‌బాస్‌కు క‌మ‌ల్‌హాస‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న ఇప్పుడు బిగ్‌బాస్ హోస్ట్ చేయ‌లేని ప‌రిస్థితి. దీంతో నిర్వాహ‌కులు ఓ ప్లాన్ చేసి రంగంలోకి ఓ హీరోయిన్‌ని దింపుతున్నారు. ఆ! మీరు చెప్పేదేముందిలే, ఆమె క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె, హీరోయిన్ శ్రుతిహాస‌నే క‌దా! అని అనొచ్చు. కానీ అలా అనుకుంటే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్లే. కోలీవుడ్ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు త‌మిళ బిగ్‌బాస్‌ను శ్రుతిహాస‌న్ హోస్ట్ చేయ‌డం లేద‌ట‌. సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ త‌మిళంలో హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ర‌మ్య‌కృష్ణ హోస్టింగ్ ఎలా చేస్తుందో, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందా లేదా? అనే అనుమానాలే అక్కర్లేదు. ఎందుకో తెలుసా? బిగ్‌బాస్ హోస్టింగ్ శివ‌గామికి కొత్తేమీ కాదు. నిజ‌మే! త‌మిళ తంబీల‌కు ఈ విష‌యం తెలియ‌క‌పోయినా, తెలుగు ఆడియెన్స్‌కు తెలుసు. ఎందుకో తెలుసా? తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4ను ర‌మ్య‌కృష్ణ ఆల్‌రెడీ ఓసారి హెస్ట్ చేశారు. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్‌లో లేన‌ప్పుడు ర‌మ్య‌కృష్ణ‌నే స‌ద‌రు షోను న‌డిపించారు. అలాగే ఓసారి స‌మంత కూడా తెలుగులో బిగ్‌బాస్‌ను హోస్ట్ చేసిందండోయ్‌. స‌మంత విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తెలుగులో స‌క్సెస్‌ఫుల్‌గా బిగ్‌బాస్‌ను ర‌న్ చేసిన ర‌మ్య‌కృష్ణ, త‌మిళంలో చాలా సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. వారికీ సుప‌రిచితురాలే కావ‌డంతో ఆమెతోనే త‌మిళ బిగ్‌బాస్‌ను క‌మ‌ల్ హాస‌న్ వ‌చ్చే వ‌ర‌కు ర‌న్ చేయాల‌ని నిర్వాహకులు భావించార‌ట‌. దానికి ర‌మ్య‌కృష్ణ కూడా ఓకే చెప్పిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో అయినా ఎన్టీఆర్ తొలి సీజ‌న్‌ను, రెండో సీజ‌న్‌ను నాని హోస్ట్ చేయ‌గా, మూడో సీజ‌న్ నుంచి నాగార్జునే హోస్ట్ చేస్తూ వ‌స్తున్నారు. కానీ త‌మిళంలో అలా కాదు.. క‌మ‌ల్‌హాస‌న్ తొలి సీజ‌న్ నుంచి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే అనుకోకుండా ఆయ‌న క‌రోనా బారిన ప‌డ‌టంతో ఇక నిర్వాహ‌కుల‌కు మ‌రో హోస్ట్‌ను తీసుకోక త‌ప్ప‌లేదు. మ‌రి ర‌మ్య‌కృష్ణ ఎన్నిరోజుల పాటు త‌మిళ బిగ్‌బాస్ షోను హోస్ట్ చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZvJtNe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...