నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ రికార్డులు ఎలా బద్దలవుతాయో అందరికీ తెలిసిందే. సింహ, లెజెండ్‌ల తరువాత బోయపాటి కాంబోలో రాబోతోన్న అంతకు మించి అనేలా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో యూట్యూబ్‌లో దుమ్ముదులిపింది. వ్యూస్‌లో రికార్డులు కొల్లగొట్టేసింది. మొత్తానికి అఖండ చిత్రం విడుదల తేదీ దగ్గరకు వచ్చేసింది. డిసెంబర్ 2న విడుదల కాబోతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగబోతోంది. శనివారం సాయంత్రం శిల్పా కళా వేదికలో జరుగబోతోన్న అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించింది.. అందులో భాగంగా బాలయ్య మీద సంచలన కామెంట్స్ చేసింది. బాలకృష్ణ గారు చాలా సీనియర్ అంటూ ప్రశంసలు కురిపించింది. ‘అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఇది వరకు ఆయన రెండు మూడు సార్లు కలిశాను. కానీ ఆయనతో మొదటి రోజు పని చేస్తున్నాని తెలియడంతో ఎంతో నర్వస్‌గా ఫీలయ్యాను. కానీ కలిసిన ఐదు నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయన అలా నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్ అవుతుంది. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన గ్రేట్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని చెప్పేసింది. ఇక ఆయన ప్రతీ రోజూ ఉదయం మూడు గంటలకు లేస్తారు.. ఆరు గంటలకు సెట్ మీదకు వస్తారు. రోజంతా కూడా షూటింగ్ చేస్తుంటారు.. మీరు మనిషేనా? అని అడిగేస్తాను అని ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రంతోనైనా ప్రగ్యా జైస్వాల్‌కు హిట్ వస్తుందా? లేదా? అన్నది చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nURVii
v
No comments:
Post a Comment