Saturday, 6 November 2021

లక్ష్య ఫస్ట్ సాంగ్: మనసుకు హత్తుకుంటున్న జగపతి బాబు, నాగ శౌర్య ఎమోషనల్ సీన్స్..

విలక్షణ కథలను ఎంచుకుంటూ కెరీర్ ఆరంభం నుంచే తెలుగు తెరపై హవా నడిపిస్తున్నారు యంగ్ హీరో నాగ శౌర్య. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. తన క్యారెక్టర్ పక్కనబెట్టి కథకు ప్రియార్టీ ఇస్తూ ముందుకెళ్తున్న నాగ శౌర్య.. ఇప్పుడు 'లక్ష్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కెరీర్‌లో లాండ్ మార్క్‌గా రాబోతోన్న 20వ చిత్రం ఇది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేశారు. ఓ లక్ష్యం అంటూ సాగే ఈ పాట ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఈ పాటలో నాగ శౌర్యకు, జగపతి బాబుకు మధ్య ఉన్న బలమైన బంధం తెలుస్తోంది. తండ్రీకొడుకులుగా , నాగ శౌర్య రోల్స్ ఈ సినిమాకు హైలైట్ పాయింట్స్ కానున్నాయని అర్థమవుతోంది. ఇందులో సరికొత్త అవతారంలో నాగ శౌర్య కనిపించబోతోన్నారు. రెండు విభిన్న గెటప్పుల్లో ఆయన నటన అబ్బురపరచనుందని టాక్. అందులో ఒకటి నేచురల్ లుక్ కాగా.. మరొకటి 8 ప్యాక్ గెటప్. ఇక ఈ చిత్రం కోసం నాగ శౌర్య ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఆర్చరీపై వస్తున్న మొట్టమొదటి చిత్రం ఈ 'లక్ష్య' కావడం విశేషం. సో.. చూడాలి మరి నాగ శౌర్య కెరీర్‌కి ఈ సినిమా ఏ మేర ప్లస్ అవుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BTrqxv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...