Saturday, 6 November 2021

నీ ఫిగర్ సైజ్ ఎంత? ఆ ఫొటో చూపెడతారా? హద్దుమీరిన నెటిజన్.. 'లోఫర్' బ్యూటీ షాకింగ్ రియాక్షన్

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఆన్ లైన్ వేదికలపై జనం ఉల్లాసంగా గడుపుతున్నారు. అయితే ఈ సోషల్ మీడియాను వాడుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. స్టార్ హీరో హీరోయిన్లు, సినీ సెలబ్రిటీలు తమ తమ సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాను విరివిగా వాడే రోజులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే నెటిజన్లతో చిట్ చాట్ లాంటివి చేయడం.. ఆ చాటింగ్స్‌లో కొందరు ఆకతాయిలు హద్దుమీరి కామెంట్స్ చేస్తుండటం లాంటివి చూస్తున్నాం. తాజాగా విషయంలో అదే జరగడంతో ఊహించని షాకిచ్చింది ఈ లోఫర్ బ్యూటీ. తన ఇన్స్‌స్టా ఖాతా ద్వారా చిట్ చాట్ చేస్తున్న క్రమంలో నీ ఫిగర్ సైజ్ ఏంటని ఓ నెటిజన్ అడిగాడు. దానిపై ఏ మాత్రం ఫైర్ కాకుండా పాండా బొమ్మను షేర్ చేసింది దిశా. అదే తన ఫిజిక్ అని చెప్పేసింది. ఇక మరో నెటిజన్ నీ బైసిప్స్ సైజ్ ఏంటి? అని అడిగేశాడు. దీనికి భారీగా కండలు దిరిగిన కార్టూన్ బొమ్మను షేర్ చేస్తూ షాకిచ్చింది ఈ బ్యూటీ. అలాగే మేకప్ లేకుండా నీ ఫొటో పెట్టమని ఓ నెటిజన్ అడగ్గా.. ఆ ఫొటో పెట్టేసింది. ఆకతాయిలకు బుద్ది చెప్పేలా దిశా చెప్పిన ఈ సమాధానాలు చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తెలుగులో 'లోఫర్' సినిమాతో దిశా పటానిని పరిచయం చేశారు పూరి జగన్నాథ్. ఈ మూవీలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లో పాగా వేసింది. టైగర్ ష్రాఫ్‌తో వరుస చిత్రాల్లో నటించిన ఆమె, ఆయనతో లవ్ ఎఫైర్ కూడా నడిపించిందనే టాక్ ఉంది. ఈ జోడీ ఎక్కడ కనిపించినా కెమెరా క్లిక్స్ వేలల్లో పడుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల పరంగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో యమ ఫామ్‌లో ఉంటోంది. దిశాకు సంబంధించి పిక్స్ నెట్టింట నిత్యం వైరల్ అవుతుంటాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qchPzv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...