సోదరుడు నటించిన ‘’ సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆనంద్‌తో పాటు విజయ్ దేవరకొండ కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ సంగతులతో పాటు తన వ్యక్తిగత విషయాలపై కూడా ఓపెన్ అయ్యారు విజయ్ దేవరకొండ. ఇద్దరు సోదరులు కలిసి సరదాగా సోషల్ మీడియా చిట్ చాట్‌లో పాల్గొని.. ‘పుష్పక విమానం’ సినిమా, దేవరకొండ సోదరుల గురించి గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవలే తన హార్ట్ బ్రేక్ అయిందని, ప్రస్తుతం తాను బ్రేకప్ బాధలోనే ఉన్నానని విజయ్ దేవరకొండ అన్నారు. ఇప్పటి వరకూ ఆ విషయం ఎవ్వరికీ తెలియదంటూ ఓపెన్ అయ్యారు రౌడీ స్టార్. ఇకపోతే ఈ 'పుష్పక విమానం' అనేది రీమేక్ సినిమా కాదని, ఒరిజినల్ కథనే అని స్పష్టం చేశారు దేవరకొండ సోదరులు. ఈ సినిమా విడుదలయ్యాక ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. లవ్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్నిరకాల యాంగిల్స్ ఈ కథలో చూపించబోతున్నట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా కామెడీ పార్ట్ ఉంటుందని, అబ్బురపరిచే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంటుందని అన్నారు. కథ విన్నాక తాము చాలా నవ్వుకున్నామని చెప్పిన విజయ్, ఈ మూవీ ఫైనల్ కాపీ తనకు చాలా బాగా నచ్చిందని పేర్కొన్నారు. ఇక పుష్పక విమానం సినిమా విషయానికొస్తే.. ఆనంద్ దేవరకొండ మూడో సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. డార్క్ కామెడీ మూవీగా కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3q9gLN3
v
No comments:
Post a Comment