Wednesday, 17 November 2021

నయనతార బర్త్ డే: విగ్నేష్ శివన్‌ సంబరం.. లవ్‌ లేడీని అలా సర్‌ప్రైజ్‌ చేసిన ప్రియుడు

నేడు (నవంబర్ 18) సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌ 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్‌తో కలిసి గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంది నయన్. కేక్ కట్ చేసి స్పెషల్‌ పార్టీ చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోనున్న ఈ జోడీ గత రాత్రి ఫుల్ ఎంజాయ్ చేసిందని సమాచారం. నయనతారకు బర్త్‌డే వేడుకలకు చెన్నై వేదికైంది. గత అర్థర్రాతి నుంచే బర్త్‌డే సంబరాలు షురూ చేసి సరిగ్గా 12 కాగానే నయన్‌తో బర్త్ డే కేక్ కట్‌ చేయించి క్రాకర్స్‌ పేల్చి సందడి చేశాడు . తన లేడీ లవ్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ బాణాసంచా కాల్చాడు. ఆ కలర్ ఫుల్ వెలుగులు మిన్నంటాయి. ఈ పార్టీకి విగ్నేష్, నయన్‌ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరై ఆమెను ఆశీర్వదించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోయిన్‌ నయనతారకు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు ఫ్యాన్స్‌. నయనతార- విగ్నేష్ శివన్ ఇద్దరిది చాలాకాలంగా కొనసాగుతున్న లవ్ ఎఫైర్. గత ఆరేళ్లుగా ఈ జంట ప్రేమాయణం సాగిస్తోంది. మొదటి సీక్రెట్‌గా నడిపించినా ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ హల్చల్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా ఈ ఏడాది ఆరంభంలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ అతిత్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది. కెరీర్ పరంగా దూకుడుగా వెళ్తూనే పెళ్లి ముహూర్తం కోసం వేట మొదలు పెట్టారు ఈ లవ్ బర్డ్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oEtB3l
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...