Wednesday, 3 November 2021

అర్దనగ్నంగా మెగా హీరో.. గని కోసం వరుణ్ తేజ్ పాట్లు!

మెగా ప్రిన్స్ ప్రస్తుతం సినిమా మీద ఫోకస్ పెట్టేశాడు. గత లాక్డౌన్ సమయం నుంచి గని సినిమా గురించి వరుణ్ తేజ్ కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. ఖాళీగా దొరికిన సమయంలోనూ వరుణ్ తేజ్ రెస్ట్ తీసుకోకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు. గని సినిమా కోసం ఎంతో శ్రమించాడు. మొత్తానికి వరుణ్ తేజ్ గని పాత్రకు కావాల్సినట్టుగా మారిపోయాడు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్రాన్సఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అందులో ఓ ఫోటోలో వరుణ్ తేజ్ షర్ట్ లేకుండా ఉన్నాడు. మొత్తానికి ఓ వైపు బాక్సర్‌గా కుస్తీ పడుతూనే.. ఇంకో వైపు సినిమాతో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. రెండూ విభిన్న పాత్రలే. ఒకటి ఎంతో సరదాగా సాగి పోయే కారెక్టర్ అయితే.. ఇంకోటి ఎంతో సీరియస్‌గా సాగే చిత్రం. ఈ రెండు సినిమాలతో వరుణ్ తేజ్ మరోసారి హిట్లు కొట్టేలా ఉన్నాడు. మొత్తానికి గని సినిమాపై ఒకే ఒక్క పాటతో అంచనాలు పెంచేశాడు. గని టైటిల్ సాంగ్‌కు తమన్ కొట్టిన మ్యూజిక్‌కు అందరూ ఫిదా అయ్యారు. అలా తొలి ప్రేమ తరువాత మళ్లీ వరుణ్ తేజ్ తమన్ కాంబో ఇలా హిట్ కొట్టేందుకు రెడీ అయింది. తాజాగా వరుణ్ షేర్ చేసిన ఫోటోలు, అందులో సినిమా కోసం పడ్డ కష్టం కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఫిట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా వరుణ్ తేజ్ నిలుస్తున్నాడు. డిసెంబర్ 3న గని రాబోతోంది. ఇక ఎఫ్ 3 సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZMyizw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...