Monday, 15 November 2021

పబ్‌లో సమంత.. దీర్ఘాలోచనలో పడ్డ సామ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సమంత, , నటించిన కాథు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వదిలిన పాట, పోస్టర్లు, లీకైన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మెయిన్ కాస్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను వదిలారు. దీంతో సమంత పాత్ర ఖతిజా ఎలా ఉండబోతోంది సింపుల్‌గా చూపించేశాడు. ఈ పోస్టర్‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు. మామూలుగా ఇంతకు ముందు లీకైన కొన్ని వీడియోల్లో చూస్తుంటే.. సమంత, నయనతార ఇద్దరూ కూడా చీరలు కట్టుకుని, తల్లో పూలు పెట్టుకుని సాధారణ మధ్య తరగతి మహిళల్లా కనిపించారు. కానీ ఇప్పుడు చూస్తుంటే సమంత అల్ట్రా మోడ్రన్‌లా కనిపిస్తోంది. అలా మొత్తానికి సమంత పోస్టర్ చూసి అంతా షాక్ అవుతున్నారు. పబ్బులో సమంత ఉండటం, ఏదో దీర్ఘాలోచనలో పడ్డట్టు ఆ పోస్టర్‌లో కనిపించింది. అయితే మరి ఇందులో ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయా? అందులో సమంత అలా కనిపిస్తుందా? ఇది ప్రజెంట్‌కు సంబంధించిన లుక్ అయి ఉండొచ్చు అని అభిమానులు చర్చలు పెట్టేశారు. మొత్తానికి విజయ్ సేతుపతి, సమంత ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చేసింది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ హైలెట్ కానుందని తెలుస్తోంది. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HpKLKu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...