Monday, 15 November 2021

సెక్యురిటీ గార్డుల గొప్పదనం అప్పుడే తెలిసింది.. రాజ్ తరుణ్ కామెంట్స్

హిట్ కొట్టి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో కుమారి 21 ఎఫ్ అంటూ హిట్ కొట్టేశాడు. మళ్లీ ఇంత వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. వరుసగా ఫ్లాపులు అవుతున్నా సరే.. మళ్లీ సక్సెస్ రుచి చూడాలని తెగ కష్టపడుతున్నాడు. కానీ హిట్ రావడం లేదు. ఒరేయ్ బుజ్జిగా అంటూ చివరగా ప్రయత్నించాడు. అది కూడా బోల్తా కొట్టింది. ఇప్పుడు అంటూ వచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ మూవీ నుంచి బతికేయ్ హాయిగా అంటూ ఓ పాటను విడుదల చేశారు. సెక్యురిటీ గార్డు జీవితానికి సంబంధించిన ఈ పాటలో వివరించారు. కింగ్ నాగార్జున అనుభవించు రాజా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను, రెండో పాట ‘నీ వల్లే రా’ను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేసింది. అలా ఈ సినిమాను మొదటి నుంచి బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సెక్యురిటీ గార్డుల మీద పాటను వదిలారు. అనంతరం రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.. అలా నిల్చుంటారు.. రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. వారు ఎంత కష్టపడతారో తెలిసింది. వారందరికీ హ్యాట్సాఫ్. ఫ్యామిలీ అంతా కలిసి కలిసి చూసే సినిమా. కచ్చితంగా అందరూ ఎంటర్టైన్ అవుతారు అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HjVeHw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...