గతంలో F2 సినిమాతో నవ్వుల హంగామా చేశారు డైరెక్టర్ . ఇప్పుడు అదే బాటలో రూపంలో మరో అడుగేసి చకచకా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను అద్దేందుకు మేకర్లు సోనాల్ చౌహాన్‌ను రంగంలోకి దించారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ ట్వీట్ పెట్టారు అనిల్ రావిపూడి. శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్న టీమ్.. హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన షెడ్యూల్ కంప్లీట్ చేస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ F3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్ రెడీ చేశారు. ఇకపోతే సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. F2 సూపర్ హిట్ సాధించడమే గాక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ F3 సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3C4zvAo
v
No comments:
Post a Comment