Friday, 1 October 2021

‘పెళ్లి సండD’ సినిమా నుంచి మరో కీలక అప్‌డేట్.. అప్పుడే ప్రేక్షకుల ముందుకు సినిమా

దర్శకేంద్రడు కే.రాఘవేంద్ర రావు సినిమాలు అంటేనే.. ఇతర సినిమాల కంటే భిన్నంగా ఉంటాయి. మాస్ సినిమాలు అయినా.. హీరోయిన్‌ని గ్లామరస్‌గా చూపించడంలో అయినా.. లేక భక్తిరస ప్రధానమైన సినిమాలు అయినా.. ఇలా ఎలాంటి సినిమా తెరకెక్కించాలన్న.. ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో మరపురాని సినిమాలు అందించారు ఆయన. ఆయన దర్శకత్వంలోనే ఎందరో హీరోలు, హీరోయిన్లు వెండితెరకు పరిచయమై ఇప్పుడ స్టార్లుగా కొనసాగుతున్నారు. అలా తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ‘పెళ్లి సందడి’ సినిమా ఒకటి. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో.. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఆ సినిమాలోని పాటలు జనాలను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ తరం ‘’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో.. గౌర రోనంకి డైరక్షన్ చేశారు. శ్రీకాంత్ తనయుడు , కన్నడ నటి ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పాటల విషయానికొస్తే.. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి అందించిన సంగీతం అది పెద్ద ప్లస్‌ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందకంటే ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించింది. తాజా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్‌లోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3utD6oA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...