Friday, 1 October 2021

బండ్ల గణేష్ దూకుడుకు కళ్లెం.. వెనుకడుగు వేసిన బండ్లన్న.. వారి సూచన మేరకే అంటూ షాకిచ్చాడు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు యూటర్న్ తిరిగాయి. దూకుడుకు కళ్లెం పడింది. దెబ్బకు బండ్ల గణేష్ నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నాడు. దీని వెనుక ఏం జరిగిందో ఏమో గానీ బండ్ల గణేష్ మాత్రం మా ఎన్నికల నుంచి తప్పుకున్నాడు. జనరల్ సెక్రటరీ పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడు. ఈమేరకు బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను అంటూ దండం పెట్టేశాడు. అయితే బండ్ల గణేష్ వేసిన ఈ ట్వీట్ వెనకాల ఎంతో జరిగినట్టు కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌లోకి జీవిత రాజశేఖర్‌ను తీసుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన బండ్ల గణేష్ ఆ సమయంలో అడ్డం తిరిగాడు. జీవిత మీద పోటిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ బరిలోకి దిగాడు. తన ప్రచారాన్ని కూడా వినూత్న రీతిలో చేసుకున్నాడు. ఎవరు ఎవరికైనా ఓట్లు వేసుకోండి.. కానీ జనరల్ సెక్రటరీగా తనకు మాత్రం అందరూ ఓటు వేయండి అని కోరాడు. అలా బండ్ల గణేష్ మా ఎన్నికల్లో దూకుడుగా వెళ్లాడు. జీవితపై ఎన్నెన్నో ఆరోపణలు చేశాడు. జీవిత కూడా బండ్ల గణేష్‌ను పరోక్షంగా కామెంట్ చేసింది. ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య కూడా దూరం పెరిగిందనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు లోలోపల ఏం జరిగిందో ఏమో గానీ బండ్ల గణేష్ వెనుకడుగు వేశాడు. నా దైవ సమానులు అని అంటూ పరోక్షంగా చిరంజీవి గురించే చెప్పినట్టు కనిపిస్తోంది. చిరు సర్దిచెప్పడంతోనే బండ్ల గణేష్ తన నామినేషన్‌ను ఉఫసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బండ్ల గణేష్ మళ్లీ యథావిథిగా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు ఇవ్వనున్నట్టు ఓ ఫోటోతో హింట్ ఇచ్చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3A5n7yo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...