Monday, 25 October 2021

సమంత గుండె ముక్కలైందట..! ఈ ఫొటోస్ అలాంటివంటూ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత యాక్టివ్ అయింది. మానసిక ప్ర‌శాంత‌త కోసం కొన్ని రోజులుగా పుణ్యక్షేత్రాలు చుట్టేస్తూ ఆధ్యాత్మిక వేట‌లో మునిగిపోయింది ఈ యంగ్ హీరోయిన్. మరోవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అప్‌డేట్స్ ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సామ్ పెట్టిన ఓ లేటెస్ట్ మెసేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. మొన్నటివరకు ఛార్ ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్,బద్రీనాథ్ అంటూ అక్కడి అద్భుతాలను అందరికీ చెప్పేసిన సమంత నిన్న ఇంట్లోనే క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ సరదాగా గడిపిన ఆమె, తన ఇన్స్‌స్టా స్టోరీగా టీం ఇండియా- పాకిస్తాన్ ప్లేయర్స్ మాట్లాడుకుంటున్న కొన్ని పిక్స్ షేర్ చేస్తూ ఇవి చాలా బ్యూటిఫుల్ అని కామెంట్ చేసింది. దీంతో పాటు తన గుండె ముక్కలైందన్నట్లుగా ఎమోజీ షేర్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది సామ్. హాలీవుడ్ ఫేమస్ నటుడు నేడు (సోమవారం) కన్నుమూశారు. ప్రోస్టేట్ క్యానర్స్‌తో గత కొన్నేళ్లుగా బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తట్టుకోలేకపోయిన సమంత.. 'నో' అంటూ గుండె బద్దలైనట్టు ఎమోజీ పంచుకుంది. దీన్ని బట్టి సమంతకు ఆయన అంటే ఎంత అభిమానం ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సత్తా చాటేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏదిఏమైనా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులొచ్చినా సినిమాల్లో రాణించాలనే సమంత సంకల్పానికి హాట్సాఫ్ అంటున్నారు ఆడియన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vFz5hi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...