Monday, 25 October 2021

బాడీ పార్ట్స్ ఒకేలా ఉన్నా అందులో తేడాలుంటాయి.. ‘వరుడు కావలెను’ డైరెక్టర్ కామెంట్స్

మహిళా దర్శకురాలిగా నందినీ రెడ్డి ఇప్పటి తరానికి సుపరిచితురాలే. ఓ హిట్టు ఓ ఫ్లాపు అన్నట్టుగా ఆమె ప్రయాణం సాగుతోంది. అయితే ఇప్పుడు మరో లేడీ డైరెక్టర్ వచ్చింది. అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. అక్టోబర్ 29న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకురాలు కొన్ని కామెంట్స్ చేసింది. సినిమా గురించి మాట్లాడుతూ కథ, కథనాలు, పాత్ర తీరులపై కామెంట్ చేసింది. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో చాలా క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ నాగశౌర్యలో ఉన్నాయనిపించింది. ఫస్ట్ నుంచి హీరోగా నాగశౌర్యనే అనుకున్నాను అని చెప్పుకొచ్చింది. మనుషులందరికీ బాడీ పార్ట్స్ ఒకేలా ఉంటాయి. కానీ పోలికల్లోనే చిన్న చిన్న తేడాలుంటాయి. అలాగే సినిమాకి సంబంధించిన స్టోరీస్, రిలేషన్స్, ఎమోషన్స్ అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మనం ఎంచుకున్న క్యారెక్టరైజేషన్, బ్యాక్‌డ్రాప్ వల్ల సీన్స్ కొత్తగా మారతాయి. అవే సినిమాకి కొత్తదనాన్ని తెస్తాయి. ఈ సినిమాలో అలాంటి కొత్తదనం ఉంటుంది అని పేర్కొంది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టే భూమికి ఉన్న అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటివాళ్లని ఎంత రెస్పెక్ట్ చేస్తుందో వాళ్ల నుంచి అదే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడదు. ఎవరినీ ఇబ్బంది పెట్టడు. అందుకే పర్యావరణానికి ఇబ్బంది లేని ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంది. అలాంటి అమ్మాయి ప్రేమించాలంటే తన కంటే ఆ అబ్బాయిలోనే ఎక్కువ క్వాలిటీస్ ఉండాలని చెప్పింది. ఈసినిమాలో హీరో పేరు ఆకాష్ . పేరుకు తగ్గట్టే ఆకాశమంత విశాల హృదయం ఉన్న వ్యక్తి. తను ఓ ఆర్కిటెక్ట్. తన ప్రొఫెషన్ లాగే లైఫ్‌ను కూడా అందంగా డిజైన్ చేసుకుంటాడు. ఇప్పుడున్న అమ్మాయిలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అబ్బాయిలకూ కనెక్ట్ అవుతుంది. ఎలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చుతారనేది ఈ సినిమా చూసి ఫాలో అవ్వొచ్చు అని చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GiSBFm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...