పవర్ స్టార్ , కాంబినేషన్‌లో రాబోతోన్న చుట్టూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయన్న సంగతి తెలిసిందే. విడుదల తేదీని ఇది వరకే ప్రకటించినా కూడా ఎక్కడో ఏదో మూల రూమర్ వస్తూనే ఉంది. సంక్రాంతి బరిలోంచి భీమ్లా నాయక్ తప్పుకున్నాడంటూ కథనాలు వస్తున్నాయి. ఇది వరకు కూడా ఇలాంటి రూమర్లు వచ్చాయి. వాటినే నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఖండించాడు. విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని, జనవరి 12న రాబోతోన్నట్టు ప్రకటించాడు. అయితే మళ్లీ ఈ మధ్య రూమర్లు పుట్టుకొచ్చాయి. ఆచార్య చిత్రం ఫిబ్రవరిలోకి షిప్ట్ అవ్వడం, ఎఫ్ 3 కూడా ఫిబ్రవరి చివరి వారంలోకి వెళ్లడంతో మరోసారి రూమర్లు రావడం ప్రారంభించాయి. భీమ్లా నాయక్ కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ కోసం పవన్ కళ్యాణ్ సైడ్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. వాటిని నిర్మాత మరోసారి ఖండించాడు. ఈ సారి కాస్త గట్టిగా అప్డేట్ ఇచ్చాడు. భీమ్లా నాయక్, డేనియర్ శేఖర్ తలపడే దృశ్యాలు, వారి పోరాటం మనం చూసేది జనవరి 12న అని క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజు వెండితెరపై అగ్గి రాజుకుంటుందని అన్నాడు. ఈ మేరకు విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ రానా, పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్న స్టిల్‌ను షేర్ చేశాడు. మొన్నీ మధ్యే క్లైమాక్స్ సీన్స్‌ను షూట్ చేశారు. అందులో భాగంగా రానా, పవన్ కళ్యాణ్‌ల మీద మంచి యాక్షన్ సీక్వెన్స్ తీశారు. దానికి సంబంధించిన స్టిల్ నెట్టింట్లో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3meInOt
v
No comments:
Post a Comment