Wednesday, 20 October 2021

అలాంటి మెసెజ్‌లకు బికినీతో ఆన్సర్!.. నా బాడీ నా ఇష్టమంటోన్న సమీరా రెడ్డి

పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారీ హిట్లు ఇచ్చిన హీరోయిన్లను గుర్తు పెట్టుకుంటారు. అతి పెద్ద డిజాస్టర్లను ఇచ్చిన భామలనూ జనాలు గుర్తు పెట్టుకుంటారు. అలా సమీరా రెడ్డి తెలుగు చిత్రసీమలో డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. జై చిరంజీవి యావరేజ్ అవ్వగా, అశోక్ చిత్రం పర్వాలేదనిపించింది. నరసింహుడు అనే సినిమా అయితే డిజాస్టర్లకే డిజాస్టర్‌గా నిలిచింది. అలా సమీరా రెడ్డికి తెలుగులో అంతగా కలిసి రాలేదు. కానీ కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ మంచి హిట్లున్నాయి. మంచి గుర్తింపు కూడా ఉంది. కానీ సమీరా రెడ్డి సినీ కెరీర్‌ను వదిలిపెట్టేసింది. ఫ్యామిలీ లైఫ్‌కే మొగ్గు చూపించింది. అలా 2014లో వ్యాపారవేత్త అయిన అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకుంది. కుటుంబ భారాన్ని మోస్తూ సమీర రెడ్డి బిజీగా ఉంది. అయితే మధ్యలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ మధ్య తన ఫ్యామిలీతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేయడం, అందులో బికినీలో సమీరా రెడ్డి కనిపించడం అంతా షాక్ అయ్యారు. ఇక లావుగా తయారవ్వడంపై సమీరా రెడ్డి మీద నెగెటివ్ కామెంట్లు చేశారు. జుట్టు ఎందుకు తెల్లబడింది అంటూ కూడా ప్రశ్నలు సంధించారు. వాటికి సమీరా రెడ్డి ఎంతో కూల్‌గా రిప్లై ఇచ్చింది. తాజాగా మళ్లీ అలాంటి ప్రశ్నలే ఎదురువ్వడంతో వివరించి మరీ చెప్పింది. మనం ఎలా ఉన్నాం.. ఎలా కనిపిస్తున్నాం.. అనే వాటి గురించి ఎవ్వరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే అలా మనం ఎందుకున్నామో కారణం చెప్పండి. తల్లయ్యాక లావుగా అయ్యావ్ అనే మాట నేను ఎప్పుడూ వింటూనే ఉంటాను. నేను దాన్ని అంగీకరించాను. తల్లికాక ముందు కూడా చాలా సార్లు అలా అయ్యాను. నా శరీరం గురించి నాకు తెలుసు. ఆరోగ్యంగా ఎలా నా శరీరాన్ని ఉంచుకోవాలో, ఫిట్‌గా ఎలా ఉంచుకోవాలో నాకు తెలుసు. చాలా మంది ఇలాంటి మెసెజ్‌లు పంపిస్తున్నారు. అందుకే ఇలా చెబుతున్నాను. నువ్ ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉండాలని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aUvH92
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...