Wednesday, 20 October 2021

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ బడ్జెట్ వింటే మైండ్ బ్లాంక్ అవుద్ది.. రేంజ్ అలా ఉంది మరి!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌ను లైన్‌లో పెట్టేశాడు. ఈ వ‌రుస‌లో ముందుగా విడుద‌ల‌వుతుంది. బాహుబ‌లి హిట్‌తో ప్ర‌భాస్‌కు పెరిగిన క్రేజ్‌, సాహోతోనూ బాలీవుడ్‌లో ప్రూవ్ అయ్యింది. దీంతో ఇప్పుడు రాధేశ్యామ్ నిర్మాణంలో బాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ టి సిరీస్ భాగ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు అక్టోబ‌ర్ 23 సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రాధేశ్యామ్ కోసం ప్రేక్ష‌కులు, ప్ర‌భాస్ అభిమానులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాధేశ్యామ్ క్లైమాక్స్ ప‌దిహేను నిమిషాల పాటు ఉంటుంద‌ట‌. ఈ ప‌దిహేను నిమిషాల ఎపిసోడ్ కోసం మేక‌ర్స్ ఏకంగా యాబై కోట్లు ఖ‌ర్చు పెట్టి చిత్రీక‌రించార‌ట‌. ఈ సీన్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా చ‌క్క‌టి యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో తెర‌కెక్కించార‌ట‌. 1975 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమక‌థ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌ని టాక్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో విక్ర‌మాదిత్య పాత్ర‌లో ప్ర‌భాస్‌, ప్రేర‌ణ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ప్ర‌భాస్ స‌లార్‌, ఆదిపురుష్ సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్స్ కూడా తుది ద‌శ‌కు చేరుకున్నాయి. మ‌రోవైపు నాగ్ అశ్విన్‌, సందీప్ రెడ్డి వంగా ప్ర‌భాస్ కోసం వెయిట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z4pbdz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...