Wednesday, 20 October 2021

మా అమ్మ ఎప్పుడూ చెప్పేది కానీ ఏ రోజు నమ్మలేదు.. ఇప్పుడు నమ్ముతున్నా.. ఓపెన్ అయిన సమంత

వెండితెరపై సత్తా చాటుతూనే బుల్లితెరపై హంగామా చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. షో ద్వారా ఇంటింటా తన మాటలతో హుషారెత్తిస్తున్నారు. ప్రేక్షకులకు జనరల్ నాలెడ్జ్ పంచుతూ హాట్ సీటులో కూర్చున్న వారికి ప్రశ్నలను సంధిస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీలను తీసుకొచ్చి సరికొత్తగా వినోదం పండిస్తుండటం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు హాట్ సీట్‌పై కూర్చొని అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చైతూతో విడాకుల ప్రకటన తర్వాత సమంత ఇలా హాట్ సీట్‌పై కూర్చోవడంతో ప్రతిఒక్కరిలో ఈ ఎపిసోడ్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. తాజాగా ఈ ఎపిసోడ్ తాలూకు ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 25లక్షల రూపాయల ప్రశ్నగా సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన శశిథరూర్‌ ‘యాస్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే పుస్తకం దేని గురించి రాయబడింది అనే ప్రశ్నపై ‘బ్రిటిష్‌ పరిపాలన’ అని సరైన సమాధానం చెప్పి ఎన్టీఆర్ ముందు ఫుల్ ఖుషీ అయింది సామ్. ఆ వెంటనే ''మా అమ్మ ఎప్పుడూ నాతో చెప్పేది నువ్ జీనియస్ అని.. నేను ఎప్పుడూ నమ్మలేదు కానీ ఈ రోజు నమ్ముతున్నా'' అనేసింది సమంత. అది నేను నిరూపించాను అని ఎన్టీఆర్ అన్నారు. నీకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా నా కాళ్లకు నమస్కారం పెట్టడం, నా ఫొటో ఇంట్లో పెట్టుకుని పూజలు చేయడం లాంటివి మాత్రం వద్దు. అవన్నీ నీకు నచ్చవని నాకు తెలుసు అంటూ సమంతపై స్వీట్ పంచ్ వేశారు ఎన్టీఆర్. దీంతో సమంత తెగ నవ్వేసింది. ఈ వీడియోలో సమంతకు చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G5VKIE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...