Wednesday, 20 October 2021

డబ్బుల కోసం అలాంటి పని చేస్తావా?.. నెటిజన్ల ఆగ్రహం.. పరువు తీసుకున్న రెజీనా

సెలెబ్రిటీలు చేసే యాడ్స్ ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నా కూడా ఇలా ఆహార ఉత్పత్తులు, ఇతర ప్రొడక్ట్‌లకు స్టార్స్ అంబాసిడర్‌గా ఉంటూ జనాల వీక్ నెస్‌తో ఆడుకోవడంపై వివాదాలు తలెత్తుతుంటాయి. తెలుగు హీరోల్లో ఎక్కువగా అంటే మహేష్ బాబు ప్రకటనల్లో నటిస్తుంటారు. దాదాపు ఇరవై ప్రొడక్ట్‌లకు పైగా అంబాసిడర్‌గా మహేష్ బాబు ఉన్నారు. అయితే అవేవీ కూడా జనాలకు అంతగా హానీ కలిగించే మత్తు మదార్థాలు, గుట్కా, మద్యం వంటివి కావు. కానీ తాజాగా ఓ హీరోయిన్ ఆల్కహాల్‌ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. రెజీనాకు ఇప్పుడు తెలుగులో అంతగా క్రేజ్ లేకుండా పోయింది. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఆ తరువాత కోలీవుడ్‌లో మంచి ఆఫర్లను పట్టేసింది. అక్కడే వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎవరు సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది రెజీనా. అందులో నటించిన తీరు, అందాలను ప్రదర్శించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. అయితే చివరగా వచ్చిన చక్ర సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. విశాల్, రెజీనాలకు సినిమా సక్సెస్ ఇవ్వలేకపోయింది. అయితే రెజీనా మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె చేసిన ఓ పోస్ట్ మీద నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆమెను అన్ ఫాలో అవుతున్నామంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. రెజీనా మీద ఇంతగా ఫైర్ అవ్వడానికి ఓ కారణం ఉంది. ఆమె ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తూ యాడ్‌లో నటించింది. విస్కీ గురించి చెబుతూ సిగ్నేచర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసింది. నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. ఇప్పుడు కమర్షియల్ చిత్రాలు, ప్రకటనలు నటించే వరకు వచ్చాను. ఇది నా ప్రయాణం. నాకు ఈ మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దీన్ని నేను సిగ్నేచర్‌తో సెలెబ్రేట్ చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. దీంతో రెజీనా మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలా ఆల్కహాల్‌ను ప్రమోట్ చేయకండి.. మీ మీద నాకు సిగ్గేస్తుంది.. మిమ్మల్ని అన్ ఫాలో అవుతున్నాను.. డబ్బుల కోసం ఇలాంటివి చేస్తారా? అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రెజీనా మాత్రం ట్రోలింగ్‌కు గురవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BaIjUd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...