Thursday, 21 October 2021

కేతిక, ఆకాష్‌లతో విజయ్ దేవరకొండ.. రొమాంటిక్ స్కెచ్చేసిన పూరి జగన్నాథ్!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో 'లైగర్' మూవీ రూపొందిస్తున్న పూరి జగన్నాథ్.. తన కొడుకు ఆకాష్ పూరి కోసం పక్కాగా స్కెచ్చేశారు. ఆకాష్ పూరి హీరోగా తన శిష్యుడు అనిల్ పాదూరి తెరకెక్కిస్తున్న '' మూవీ ప్రమోషన్స్ విషయంలో కాస్త డిఫరెంట్‌ వే లో వెళ్తున్నారాయన. ఈ మేరకు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండను రంగంలోకి దించుతున్నారు పూరి. అక్టోబరు 29న ఈ మూవీ విడుదల చేస్తున్న నేపథ్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి విజయ్ దేవరకొండతో హంగామా చేయించబోతున్నారు. రేపు (అక్టోబర్ 22) ఈ చిత్ర ప్రీ ఈవెంట్ ప్లాన్ చేసి విజయ్ దేవరకొండను ముఖ్య అతిథిగా పిలిచారు. అదేవిధంగా ఈ వేడుకకు వరంగల్ నగరాన్ని వేదిక చేశారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సాయంత్రం 6 గంటల నుండి ఈ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాతో ఆకాష్ పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడని భావిస్తున్నారు ఆడియన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vyKMqj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...