Thursday, 21 October 2021

ఊపేసిన మంచు లక్ష్మి.. పిచ్చి ముదిరింది!! వీడియోతో దుమ్ముదుమారం

టాలీవుడ్ నటి, మంచు మోహన్ బాబు డాటర్ చేసే హంగామా అంతాఇంతా అని చెప్పలేం. తనదైన మాటలతో, కామెంట్లతో నిత్యం వార్తల్లో చోటు దక్కించుకునే ఆమె.. అటువైపు సోషల్ మీడియాలోనూ తెగ హల్చల్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడంతో పాటు మంచు ఫ్యామిలీ ముచ్చట్లను నెటిజన్ల ముందు పెడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో ఆన్‌లైన్ వేదికపై రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో డ్రెస్సులు మారుస్తూ, బాడీ షేక్ చేస్తూ డాన్స్ చేస్తూ కనిపించింది మంచు లక్ష్మి. ఆమెలో కనిపిస్తున్న హుషారైతే మాటల్లో చెప్పలేం. ఓ రకంగా చెప్పాలంటే ఊపేసిందని అనొచ్చు. పైగా దీనిపై 'పిచ్చి ముదిరింది' అనే లైన్ ట్యాగ్ రాసింది ఈ మోడ్రన్ సుందరి. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు మంచు వారమ్మాయిని సూపర్ అని పొగుడుతుండగా.. ఇంకొందరు మాత్రం దొరికింది కదా ఛాన్స్ అని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ''మా ఊరిలోని గరగా డాన్స్ లాగా వుంది, నవ్వు ఆపుకోలేక చస్తున్నాం, వీళ్ళని ఎక్కడైనా చూపించండిరా బాబు, కరెక్ట్ టైటిల్ పిచ్చి నిజంగానే ముదిరింది, ఓరయ్యో నా అయ్యా'' అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే మంచు లక్ష్మికి ట్రోల్స్ బారిన పడటం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలా నెటిజన్ల ట్రోలింగ్‌కి గురైన మంచు వారమ్మాయి.. ట్రోలర్స్‌కి గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది. ఏదేమైనా తాజా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jjfX3F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...