Thursday, 21 October 2021

Samantha: అలాంటి ఆలోచనలు వెంటాడేవి.. అందుకే నాకు నేనే..!! గుట్టువిపిన సమంత

గత కొన్ని నెలలుగా గురించిన ప్రతి వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎప్పుడైతే ఆమె విడాకుల ఇష్యూ తెరపైకి వచ్చిందో అప్పటినుంచి సామ్ గురించి రకరకాలుగా చెప్పుకున్నారు జనం. ఇంతలో నిజంగానే డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించి సడెన్ షాకిచ్చింది సమంత. ఈ పరిస్థితుల నడుమ ఎవరేమనుకున్నా పెద్దగా పట్టించుకోకుండా తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన సామ్.. రీసెంట్‌గా '' సినిమాను కంప్లీట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలపై ఆమె ఓపెన్ అయింది. తానెప్పుడూ ధైర్యంగా ఉంటానని చెప్పింది సమంత. కాకపోతే గత కొన్నేళ్లుగా ఒక్కటి మాత్రం గ్రహించానని అంటోంది. రొటీన్‌గా ఒకటే తరహా చిత్రాలు చేయడానికి అలవాటు పడిపోయానా? అని ఆలోచనలో పడ్డానని, వాటి నుంచి బయటకు వచ్చేందుకు తనకు తానే ఓ సవాల్ విసురుకుని, టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలెట్టానని ఆమె తెలిపింది. ఇకపై మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి సిద్దమే అనే హింట్ ఇచ్చింది సమంత. మొదటి నుండే తనకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం కాబట్టి ‘శాకుంతలం’ సినిమా చేస్తున్నప్పుడు ఏ మాత్రం ఒత్తిడికి గురికాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇందులో ఎప్పుడూ చూడనంత అందంగా కనిపిస్తానని.. అదే ఒత్తిడి తప్ప వేరే ఏం లేదని సమంత పేర్కొంది. ‘శాకుంతలం’ రూపంలో తన డ్రీమ్ రోల్ చేసే అవకాశం లభించిందని ఆమె చెప్పింది. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ 'శాకుంతలం' సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా గుణ టీం వర్క్స్ బ్యాన్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G6CR8n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...