Friday, 29 October 2021

పునీత్ రాజ్ కుమార్ మరణం.. భారత చిత్రసీమకు తీరని లోటు.. చిరంజీవి ఎమోషనల్

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) మరణంతో శాండల్ వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గుండె పోటుతో మరణించడంతో అందరూ తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. అప్పు అంటూ ప్రేమగా పిలుచుకునే తమ హీరో లేడని తెలిసి అభిమానులు కన్నీరు కారుస్తున్నారు. ఇక అప్పు మరణంపై కన్నడ సినీ ప్రముఖులే కాకుండా ఇతర భాషా నటులు సైతం స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి , వరుణ్ తేజ్, ప్రకాష్ రాజ్, తమన్, సుధీర్ బాబు, రామ్ వంటి వారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నేను చూసిన వారిలో ఎంతో ఒదిగి ఉండే నటుడు, ఎంతో మంచి నటుడు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి- రామ్ కన్నడ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టి ఓ తార ఎంతో త్వరగా మనల్ని వదిలి వెళ్లింది.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి- సుధీర్ బాబు జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని సార్లు మనకు జరిగే నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు.. ఎవ్వరూ భర్తీ చేయలేరు.. దేవడా? నువ్ మరి ఇంత దయలేనివాడివా?. ఇలా మంచి వారినే ఎందుకు తీసుకెళ్తావ్.. కన్నీళ్లు ఆపుకోలేకపోతోన్నా.. పునీత్ అన్నా.. - తమన్ ఓ నో.. నా ప్రియమైన అప్పు.. త్వరగా వెళ్లిపోయావ్.. నాకు ఎంతో బాధగా ఉంది. కుప్పకూలిపోయాను.. గుండె బద్దలైంది. ఇది సరైంది కాదు.. ఇదెంతో దుర్దినం- ప్రకాష్ రాజ్ ఒక్కసారిగా షాక్ అయ్యాను. పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యాన్స్, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది ఎంతో దురదృష్ణం ఓం శాంతి- వరుణ్ తేజ్ గుండె బద్దలైనట్టు అనిపిస్తోంది.. కుప్పకూలిపోయినట్టు అనిపిస్తోంది. పునీత్ రాజ్ కుమార్ ఎంతో త్వరగా వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతికలగాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కన్నడ ఇండస్ట్రీకే కాకుండా ఇండియన్ సినీ కుటుంబానికి తీరిని లోటు-చిరంజీవి


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/311xJSP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...