కన్నడ కథానాయకుడు పునీత్ రాజ్‌కుమార్(46) శుక్రవారం మరణించారు. దీంతో శాండిల్‌వుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సినీ సెలబ్రిటీలు మరణంపై తమ విచారాన్ని వ్యక్తం చేశారు. మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘మహా నటుడు రాజకుమార్ అంటే కన్నడ రాష్ట్రం... మా కుటుంబానికి వారి కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. రాజకుమార్ గారి కుమారుడు పునీత్ రాజకుమార్ అకాలమరణం చెందిన వార్త విని ఆశ్చర్యపోయాను. ఇది కన్నడ సినీ పరిశ్రమకే కాదు... యావత్ భారతదేశ సినీ పరిశ్రమకి తీరని లోటు అన్నారు. ‘‘నా మంచి స్నేహితుడు పునీత్ రాజ్‌కుమార్ మరి లేరనే సంగతిని నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి. ఆయన లేకపోవడం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అలాగే నా ప్రియ మిత్రుడిని కోల్పోవడం నాకు ఇంకా పెద్ద లోటు’’ అని విశాల్ అన్నారు. జీవితం వెలకట్టలేనిది. వీలైనంత మేరకు నవ్వుతూ ఉండండి. పగ, ద్వేషాలు పెంచుకోకండి. గొడవలు పడకండి. సంతోషాన్ని పంచండి. అప్పు.. నువ్వొక జెమ్. ఇలా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం ఎంతో బాధగా ఉంది. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వెళ్లకు తిరిగి వచ్చెయ్’’ అని ఖుష్బూ తన బాధనున వ్యక్తం చేశారు. ‘‘ఎవరైనా చెప్పండి. నేను విన్నది నిజం కాదని’’ అంటూ ప్రణీత సుభాష్ తన బాధను వ్యక్తం చేశారు. నా వీర కన్నడిగ పునీత్ రాజ్ కుమార్‌గారు ఇప్పుడు లేరు. గుండె బద్దలవుతుంది. ఇది నమ్మలేకపోతున్నాను. నా ఆప్తుడు, సోదరుడిని కోల్పోయాను’’ అంటూ మెహర్ రమేశ్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన జిమ్ చేస్తున్న సమయంలో గుండె నొప్పి రావడంతో కుప్ప కూలిపోయారు. వెంటనే ఆయన్ని విక్రమ్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు ఆయనకు చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే మధ్యాహ్నం ఆయన మరణవార్తను డాక్టర్లు ధృవీకరించారు. ఇది శాండిల్‌వుడ్ పరిశ్రమకు షాకింగ్ న్యూస్. పునీత్ ఐదేళ్లకే బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. తండ్రి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో కలిసి సినిమాలు చేశారు. ఇప్పటి వరకు 29 సినిమాల్లో ఆయన నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CtgNlZ
v
No comments:
Post a Comment