Friday, 29 October 2021

పునీత్ మరణంపై మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ రియాక్షన్.. రియల్లీ షాక్ అంటూ!

కన్నడ చిత్రసీమలో తీవ్ర విషాదం అలుముకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో (46) అకాలమరణంతో శాండిల్‌వుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణవార్త తెలిసి రాజ్‌కుమార్ అభిమానులు అయితే గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. అప్పు.. నీకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ రోజు (అక్టోబర్ 29) శుక్ర‌వారం ఉద‌యం జిమ్ చేస్తుండ‌గా గుండె నొప్పి రావ‌డంతో ఒక్కసారిగా కుప్పకూలిన పునీత్‌ను వెంటనే బెంగుళూరులోని విక్రమ్‌ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తుండగానే పునీత్‌ రాజ్‌కుమార్‌ తుది శ్వాస విడిచారు. పునీత్ మరణ వార్తతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్‌కి గురైంది. కన్నడ హీరో అయినా తెలుగు స్టార్ హీరోలందరితోనూ పునీత్‌కు మంచి పరిచయాలున్నాయి. దీంతో తెలుగు సినీ ప్రముఖులు కూడా పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ''పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విని షాకయ్యా. నాకు తెలిసిన అత్యంత వినయపూర్వకమైన వ్యక్తులలో ఆయన ఒకరు. పునీత్ కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా'' అని ట్వీట్ చేశారు. ''పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరని తెలిసి షాక్‌కి గురయ్యా.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ షాకింగ్ న్యూస్ తెలిసి నోట మాట రావడం లేదు'' అని అన్నారు. అలాగే కోన వెంకట్, రామ్ పోతినేని, హన్సిక, కార్తిక్ సుబ్బరాజు సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పునీత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bnHNrq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...