Friday, 29 October 2021

పునీత్ రాజ్ కుమార్ మరణం.. కనువిప్పు కలగాల్సిన సమయం!.. ఇలాంటి టైంలోనూ ఆర్జీవీ పైత్యం

కన్నడ ఇండస్ట్రీలో ప్రస్తుతం విషాదంలో నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) మరణంతో విషాదచాయలు నెలకొన్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం భిన్న రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. పునీత్ ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నారు.. చనిపోలేదు.. ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి.. సెలెబ్రిలు కాస్త ఆలోచించి ట్వీట్లు వేయండి, రిప్ అనిపెట్టకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సమయాన్ని కూడా వాడుకున్నాడు. రిప్ అని పెట్టడంతో మంచు లక్ష్మీని నెటిజన్లు ఆడుకున్నారు. దేవుడా ఇది నమ్మలేకపోతోన్నాను.. ఇది కచ్చితంగా నిజం కాకూడదు. ఇదెలా సాధ్యమవుతుంది.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. ఆయన పరిపూర్ణ శుద్ద ఆత్మకు శాంతి చేకూరాలి.. చాలా త్వరగా వెళ్లిపోయారు అంటూ మంచు లక్ష్మీ ఎమోషనల్ అయింది ఇది నిజంగానే షాక్‌లా ఉందిన పూనమ్ కామెంట్ చేసింది. గుండె బద్దలు అయిందంటూ సోనూ సూద్ ట్వీట్ వేశాడు. ఇక నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాం సోదర అంటూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. ఇక ఆర్జీవీ మాత్రం తన స్టైల్లో కౌంటర్ వేశాడు. మానవాళికి ఓ సందేశాన్ని ఇచ్చాడు. ఆయన మరణ వార్త షాకింగ్‌గా ఉంది అది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు అందరూ కళ్లు తెరవాల్సిన సమయం వచ్చింది. ఎప్పుడు ఎవరం ఉంటామో పోతామో కూడా తెలియదు. అందుకే ఉన్నంత వరకు ఫుల్లుగా ఎంజాయ్ చేయాలి.. సంతోషంగా గడపాలి అని ఆర్జీవీ నీతి బోధనలు చేశాడు. ఇక పునీత్ రాజ్ కుమార్‌ను చూసేందుకు కన్నడ రాష్ట్రం మొత్తం తరిలివస్తోంది కన్నడ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాస్పిటవ్ వద్దకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో హై అలర్ట్‌ను ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CrJHTI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...