Monday, 25 October 2021

అల్లు అర్జున్ అలా.. నాగబాబు ఇలా! ఎన్నో ఊహలు కానీ చివరకు నిరాశ తప్పలేదు మరి..

చాలామంది సినిమా స్టార్స్ క్రికెట్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. కొందరు టీవీలకు అతుక్కుపోతే.. ఇంకొందరు ఏకంగా స్టేడియం వెళ్లి క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అందునా అంటే ఇంకేమన్నా ఉందా? సెలబ్రిటీలు మొదలుకొని సాధారణ జనం వరకు ఏ ఒక్కరూ ఈ మ్యాచ్ వదిలిపెట్టరు. ఈ క్రమంలోనే నిన్న (ఆదివారం) జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తిలకించారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. ఆదివారం రోజు భార‌త్ -పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్తాన్ నెగ్గింది. భారత్ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు కానీ అలా జరిగిపోయింది. మ్యాచ్ జయాపజయాల సంగతి అటుంచితే ఆదివారం సెలవు దినం కావడంతో ఈ మ్యాచ్ ఎంజాయ్ చేశారు మెగా హీరోలు. ఇంట్లోనే కూర్చొని అర్హ, అయాన్‌లతో కలిసి క్రికెట్ వీక్షించగా.. మెగా బ్రదర్ మాత్రం తన కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి స్టేడియంలో ఎంజాయ్ చేశారు. అదే విధంగా అక్ష‌య్ కుమార్, ప్రీతి జింతా లాంటి స్టార్స్ స్టేడియంలో సంద‌డి చేశారు. అల్లు అర్జున్ సరదాగా మ్యాచ్ చూస్తున్న వీడియోను ఆయన భార్య స్నేహా రెడ్డి త‌న ఇన్‌స్టా స్టేట‌స్‌లో షేర్ చేసింది. అలాగే నాగబాబు సైతం మ్యాచ్ చూస్తున్న ఫోటోను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. అదేవిధంగా వరుణ్ తేజ్ 'గని' సినిమా పనులతో బిజీ బిజీగా ఉన్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3maBKg1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...