Monday, 25 October 2021

‘లైగర్’ రిలీజ్‌పై పూరీ జగన్నాథ్ అప్‌డేట్.. రోడ్డుపై అభిమానితో.. వీడియో విడుదల చేసిన ఛార్మి

హీరోయిజాన్ని ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా, మెచ్చేలా ఎలివేట్ చేసే ద‌ర్శ‌కుల్లో ముందుగా వినిపించే పేరు పూరీ జ‌గ‌న్నాథ్‌. సాధార‌ణంగా తెలుగు, హిందీ అంటూ ఏదో ఒకే భాష‌లోనే సినిమా చేసే పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు ‘లైగ‌ర్‌’పాన్ ఇండియా మూవీతో తొలిసారి డిఫ‌రెంట్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా లేటెస్ట్ అప్‌డేట్ చిత్ర నిర్మాత ఛార్మి కౌర్ తెలిపారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండపై పాట‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఇది వ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని స్టైల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ డాన్స్ చేస్తున్నాడంటూ ఛార్మి తెలిపారు. దీంతో ఛార్మి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వీడియోను పోస్ట్ చేశారు. ముంబై లొకేష‌న్‌కు వెళుతున్న‌ప్పుడు ఓ సిగ్న‌ల్ దగ్గ‌ర పూరి కారు ఆగింది. ముంబైలోని ప్రమోద్ అనే తెలుగు యువకుడు ఆ కారు నెంబర్ ప్లేట్ చేసి ఎవ‌రైనా తెలుగువారుంటారనుకుని వ‌చ్చాడు. తీరా చూస్తే.. అక్క‌డ పూరీ జ‌గ‌న్నాథ్ క‌నిపించాడు. అస‌లే పూరి సినిమాలంటే ఎంత‌గానో ఇష్ట‌ప‌డే స‌ద‌రు యువ‌కుడు ఆయ‌న‌తో మాట్లాడాడు. పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఆ కుర్రాడితో మాట్లాడాడు. ఏం చ‌దువుకుంటున్నావ‌ని పూరి అడిగితే ఇంట‌ర్ చ‌దువుతున్నాన‌ని, ఓ ఏడాది త‌ప్పాన‌ని, ప్ర‌స్తుతం ఆన్‌లైన్ క్లాసులు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌మోద్ తెలిపాడు. బాగా చ‌దువుకోవాల‌ని పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌మోద్‌కు చెప్పాడు. మీ సినిమాలంటే ఎంతో ఇష్ట‌మ‌ని ప్ర‌మోద్ చెప్ప‌గా, లైగ‌ర్ చూడు.. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుందని చెప్పాడు. అంటే లైగ‌ర్ రిలీజ్‌కు సంబంధించి పూరీ జ‌గన్నాథ్ అప్‌డేట్ ఇచ్చేశాడు. పూరీ జ‌గ‌న్నాథ్‌, ప్ర‌మోద్ మాట్లాడుకున్న వీడియోను ఛార్మి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. త‌న లుక్ కూడా ఇది వ‌ర‌కు ఏ సినిమాలో లేన‌ట్లు ఉండ‌బోతుంది. ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఈ సినిమాలో న‌టించ‌డం విశేషం. ఈ విషయాన్ని ఇది వ‌ర‌కే చిత్ర యూనిట్ ప్రక‌టించింది. భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి మైక్ టైస‌న్‌ను న‌టింప చేయ‌డానికి పూరీ అండ్ టీమ్ ఒప్పించింది. పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాను డైరెక్ట్ చేయ‌డ‌మే కాకుండా ఛార్మి, ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ఇలా మొత్తం యూనిట్‌కు లైగ‌ర్ తొలి పాన్ ఇండియా మూవీ. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GipguC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...