Monday, 25 October 2021

ప్రేమ పక్షులు నయన్- విగ్నేష్‌లకు సమంత కంగ్రాట్స్.. అలా కామెంట్ చేయడంతో ఇష్యూ వైరల్

సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రేమ సంగతులు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. నిత్యం ఏదో ఒక రూపంలో నయన్ లవ్ టాపిక్స్ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే ఈ సారి మాత్రం ఆమె లవ్ మ్యాటర్‌కి ప్రొఫెషనల్ కెరీర్ కూడా యాడ్ అయి పతాక శీర్షికల్లో నిలిచింది. నయన్, తన ప్రియుడు విగ్నేష్ శివన్ కలిసి నిర్మించిన ఓ తమిళ చిత్రం ఆస్కార్‌ ఎంట్రీని దక్కించుకోవడం, దీనిపై హీరోయిన్ రియాక్ట్ కావడం హాట్ టాపిక్ అయింది. కాబోయే భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్‌తో కలిసి నయనతార ‘’ (పెబెల్స్‌) పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పి.ఎస్‌ వినోథ్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. 2021 సంవత్సరానికి గాను ప్రదానం చేయనున్న 94వ ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం తరపున ఈ సినిమా ఎంపిక కాబడింది. ఈ నేపథ్యంలో దీనిపై రియాక్ట్ అవుతూ సమంత బిగ్ కంగ్రాట్స్ చెప్పింది. ''కూజంగల్‌ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా నయన్, విగ్నేష్‌లకు బెస్ట్ విషెస్. భవిష్యత్తులో మీకు ఇంకా బలం చేకూరాలని కోరుకుంటున్నా'' అని పేర్కొంది సమంత. దీంతో ఈ మెసేజ్ నెట్టింట వైరల్ అయింది. మరోవైపు ఆస్కార్‌ గెలుచుకునేందుకు కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నానని, నిర్మాతగా మంచి కంటెంట్‌ను తెరకెక్కించినందుకు గర్వపడుతున్నానని ఈ సినిమాను ఉద్దేశిస్తూ విగ్నేష్ శివన్ రియాక్ట్ అయ్యారు. నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించాక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది సమంత. ఎప్పటికప్పుడు మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ రెగ్యులర్‌‌గా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇకపై కెరీర్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా దూసుకుపోవాలనేది సమంత ప్లాన్ అని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nmJGu1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...