Friday, 22 October 2021

ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. రవితేజపై నాగబాబు సెటైర్లు

మాస్ మహారాజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ స్పీడు మీదున్నాడు. ఈ ఏడాది క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి మంచి ఊపులో ఉన్నాడు. ఇక ఆ చిత్రం ఇచ్చిన ఎనర్జీతో రవితేజ వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించాడు. ఇందులో భాగంగా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి ప్రాజెక్ట్‌ల అప్డేట్లు ఇచ్చేశాడు. సినిమా అయితే వరుస షెడ్యూల్‌లతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ యూనిట్ దుబాయ్‌కి చెక్కేసింది. పాట చిత్రీకరణ కోసం నేడు దుబాయ్‌కు చిత్రయూనిట్ వెళ్లిందంటూ మేకర్లు ప్రకటించారు. అక్కడే రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిల మీద పాటను షూట్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే దానికి నాగబాబుకు ఉన్న సంబంధం ఏంటో అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే తాజాగా రవితేజతో ప్రైవేట్ ఫ్లైట్‌తో ప్రయాణించాడు. దానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ రవితేజ మీద సెటైర్లు వేశాడు. అయితే నాగబాబు కూడా దుబాయ్ వెళ్లాడా? లేదా ఇది ఎప్పుడో దిగిన ఫోటో అయినా ఇప్పుడు పోస్ట్ చేశాడా? అన్నది తెలియడం లేదు. కానీ నాగబాబు, రవితేజ కలిసి దిగిన ఈ సెల్ఫీ పిక్‌లో కొన్ని హైలెట్ అవుతున్నాయి. ఈ ప్రైవేట్ ఫ్లైట్, అందులో సౌకర్యవంతమైన సెటప్‌ను చూసి అది ఫ్లైటా? స్వర్గసీమా? అని నెటిజన్లు నోరెళ్లబెట్టేస్తున్నారు. అయితే రవితేజ పక్కనుంటే చాలు ఎంతో ఎనర్జీ, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం.. నవ్విస్తూనే ఉంటాడు.. రవితేజ ఉంటే ఆ రోజులో అంతకంటే ఏం కావాలి అని నాగబాబు చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3E9Xqz5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...