Friday, 22 October 2021

పెళ్లి సందD ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. రాఘవేంద్రుడి సినిమా పరిస్థితి ఎలా ఉందంటే!

దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి రూపొందించిన '' సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్, కొత్త హీరోయిన్ శ్రీ లీల హీరోహీరోయిన్లుగా రూపొంది గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా తొలివారం పూర్తిచేసుకుంది. మరి ఈ వారం రోజుల్లో ఏ మేర కలెక్షన్స్ వచ్చాయి? సినిమా హిట్టా? ఫట్టా అనే దానిపై ఓ లుక్కేద్దామా.. విడుదలకు ముందు రాఘవేంద్రుడు చేసిన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమే గాక, ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది పెళ్లి సందD. అన్ని ప్రాంతాల్లో కలిపి 5.70 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏరియాల వారీగా మొత్తం 7 రోజుల రిపోర్ట్: నైజాం: 1.65Cr సీడెడ్: 1.19Cr ఉత్తరాంధ్ర: 74L ఈస్ట్ గోదావరి: 37L వెస్ట్ గోదావరి: 31L గుంటూరు: 50L కృష్ణా: 34L నెల్లూరు: 26L టోటల్ AP+ TG 5.36CR(8.80CR గ్రాస్) రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ వారం రోజుల్లో 5.36 కోట్లు షేర్ రాబట్టిన ఈ మూవీ.. కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో కలిపి మరో 22 లక్షలు, ఓవర్సీస్‌లో 7 లక్షలు మేర వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ ఏడు రోజుల్లో 5.65 కోట్ల షేర్, 9.40 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. దీంతో బ్రేక్ ఈవెన్‌కి అతి దగ్గరలోకి చేరింది పెళ్లి సందD. మరో 35 లక్షలు రాబడితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినట్లే. 25 ఏళ్ల క్రింద ‘పెళ్లి సందడి’ పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇప్పుడు మోడ్రన్ 'పెళ్లి సందD'తో ఈ తరం ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాతో నటుడిగా రాఘవేంద్ర రావు కెమెరా ముందుకు రావడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aZ011Z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...