Friday, 1 October 2021

సింగర్ సునీత గోవా ట్రిప్.. వాళ్లతో కలిసి చిల్.. నాలాంటి వాళ్లకు అదే బెస్ట్ ప్లేస్!

సింగర్ సోషల్ మీడియాలో ఈ మధ్య ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. పెళ్లి తరువాత సునీతలో ఎంతో మార్పు వచ్చింది. అంతకు ముందు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసేది కాదు. అంత ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వారు కూడా కాదు. ఇక నెటిజన్లు చేసే కామెంట్లను పట్టించుకునేది కాదు. వాటికి అసలే రియాక్ట్ అయ్యే వారు కాదు. కానీ ఇప్పుడు సునీత సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. తన భర్త రామ్ వీరపనేని గురించి ఎవరైనా ఏదైనా అన్నా, తమ దాంపత్య జీవితం మీద ఎవరైనా కామెంట్లు చేసినా తిరిగి కౌంటర్లు వేస్తూ ఉంటోంది. తనకు సోషల్ మీడియాలో ఎంత వరకు ఉండాలి, తన వ్యక్తిగత జీవితాన్ని ఎంత వరకు ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే దానిపై క్లారిటీ ఉందంటూ సునీత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకే తాను వెకేషన్లకు ఎక్కడికైనా వెళ్తే.. వెంటనే ఫోటోలను షేర్ చేయను అని తెలిపింది. వెకేషన్‌కు వెళ్లి వచ్చాక ఎప్పుడో అలా గుర్తుకు వచ్చినప్పుడు ఆ ఫోటోలను షేర్ చేస్తాను అని సునీత చెప్పుకొచ్చింది. అయితే తాజాగా సునీత కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటితో పాటు ఓ కామెంట్ కూడా చేసింది. దాన్ని బట్టి చూస్తే.. సునీత గోవాలో బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నాలాంటి ప్రకృతి ప్రేమికురాలు, ఎప్పుడైతే స్నేహితులతో కలిసి గోవాకు వెళ్తే అద్భుతమైన ప్లేస్ అవుతుంది. అంతే కాకుండా మంచి ఫోటోలు తీయమని డిమాండ్ కూడా చేయవచ్చు అంటూ తన స్నేహితురాళ్లు పద్మజ, అన్నపూర్ణలతో ఎంజాయ్ చేసినట్టు సునీత చెప్పకనే చెప్పేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39WuA80
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...