Friday, 1 October 2021

రిపబ్లిక్ క్లైమాక్స్ ట్విస్ట్.. సాయి ధరమ్ తేజ్‌ పాత్ర అంతం! అభిమానుల్లో నిరాశ

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ గురించిన పలు విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన హెల్త్ ఎలా ఉందన్న విషయమై జనాలు ఆరా దీస్తున్నారు. మరోవైపు సాయి తేజ్ హాస్పిటల్‌లో ఉండగానే మెగా హీరోల అండదండలతో ఆయన లేటెస్ట్ మూవీ 'రిపబ్లిక్'ని నేడు (అక్టోబర్ 1) ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో అందరి దృష్టి ఆ ఆసినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ క్లైమాక్స్‌లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ పెట్టడం సాయి తేజ్ అభిమానుల్లో కాస్త నిరాశ నింపింది. గత రాత్రి నుంచే సెలబ్రిటీలు చేస్తున్న ట్వీట్స్‌తో 'రిపబ్లిక్' సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. దీంతో సాయి తేజ్ ఫ్యాన్స్ రిపబ్లిక్ చూసేందుకు థియేటర్ల వద్ద ఎగబడ్డారు. అయితే సినిమా కథ, సాయి తేజ్ నటనపై పాజిటివ్ రియాక్షన్స్ ఇస్తున్న ఫ్యాన్స్.. చివర్లో సాయి తేజ్ పాత్రను అంతం చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. పొలిటికల్ నేపథ్యంలో దేవ కట్టా రూపొందించిన 'రిపబ్లిక్' మూవీలో సాయి తేజ్ కలెక్టర్ రోల్ పోషించారు. అన్యాయం, అవినీతిని బలంగా ఎదుర్కొనే పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా వెండితెరపై ఆయన చూపిన అభినయం, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయని చెబుతున్న ఫ్యాన్స్.. చిత్ర క్లైమాక్స్‌లో సాయి తేజ్ పోషించిన పాత్రను చంపేయడం నిరాశకు లోను చేసిందని అంటున్నారు. అసలే ఓ వైపు సాయి తేజ్ ఆరోగ్యంపై టెన్షన్‌గా ఉంటే ఇలా సాయి తేజ్ చనిపోవడం చూసి తట్టుకోలేకపోయామని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా.. నీతి, నిజాయితీగా ఉండే ఏ ఒక్కడినీ సమాజం బ్రతకనీయదు అని చెప్పే ప్రయత్నం డైరెక్టర్ దేవ కట్టా చేశారని చెప్పుకోవచ్చు. చిత్రంలో రమ్యకృష్ణ రోల్ స్పెషల్ అట్రాక్షన్ అయిందనే టాక్ నడుస్తోంది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FiAJtZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...