Friday, 1 October 2021

ఇదే మా కథ ఈవెంట్.. డైరెక్టర్ ఎంట్రీకి గోల.. ఎంతిచ్చారో అంటూ పరువుదీసిన యాంకర్!

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అభిమానుల గోలతో ఆ ప్రాంగణమంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుంది. స్టార్ హీరోల సినిమా ఈవెంట్లు అంటే మాత్రం ఫ్యాన్స్ హద్దులు దాటుతుంటారు. తమ హీరోలను చూసేందుకు, తాకేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆరాటపడుతుంటారు. సడెన్‌గా స్టేజ్ మీదకు వస్తుంటారు. ఇక స్టార్ హీరోలు ప్రసంగం ప్రారంభించినా, స్టేజ్ మీదకు వచ్చినా కూడా కూడా అరుపులతో మోత మోగిపోతోంటోంది. కానీ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ప్రసంగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఆ సమయంలో ఓ గుంపు మాత్రం తెగ సందడి చేసింది. ఓ అంటూ తెగ అరిచేసి కేకలు పెట్టేశారు. అయితే సిగ్గుపడుతూ దర్శకుడు ప్రసంగం ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు.కానీ అంతలోపే అక్కడ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తోన్న యాంకర్ గీత వేసిన కౌంటర్‌తో దర్శకుడి పరువుపోయినట్టైంది. ఎంత ఇచ్చారండి అని కౌంటర్ వేసింది. ఎంత ఇచ్చారని అంటున్నారు.. ఏం ఇచ్చారో చెప్పండి అని ప్రేక్షకులనే ఆ దర్శకుడు అడిగేశాడు. ఆయన పక్కన ఉన్న స్నేహితుడు వచ్చి.. ప్రేమ ఇచ్చారు.. సెటిల్మెంట్ అయిందని అన్నాడు. మొత్తానికి అలా దర్శకుడిని ఆ యాంకర్ ఆట పట్టించేసింది. ఇదే మా కథ అంటూ మొదటి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దర్శకుడు గురు పవన్ అక్టోబర్ 2న రాబోతోన్నాడు. ఇందులో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యా హోప్‌లు నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uvgW5p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...