Friday, 8 October 2021

ఎన్టీఆర్‌ను ఫాలో అయిన అల్లు అర్జున్.. తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లడానికి కారణమదేనా?

ఐకాన్ స్టార్ మ‌రో స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యారు. ఇంత‌కీ ఎన్టీఆర్‌ను అల్లు అర్జున్ ఏ విష‌యంలో ఫాలో అయ్యారో తెలుసా?.. భూముల కోనుగోలు విష‌యంలో. వివ‌రాల్లోకెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంక‌ర్ ప‌ల్లి మండ‌లంలోని జవ్వాడ‌లో బ‌న్నీ రెండు ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమిని కోనుగోలు చేశారు. ఈ భూమిని సొంతం చేసుకోవ‌డానికి రిజిస్ట్రేష‌న్ ప‌నుల నిమిత్తం త‌హ‌సీల్దారు కార్యాల‌యంకు వెళ్లారు. రిజిస్ట్రేష‌న్ ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత ప్రోసీడింగ్ ఆర్డ‌ర్‌ను బ‌న్నీకి అంద‌జేశారు. ఎమ్మార్వో కార్యాల‌యానికి బ‌న్ని వ‌చ్చాడ‌ని తెలుసుకున్న‌, అభిమానులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. సెల్ఫీలు దిగ‌డానికి ఆస‌క్తి చూపించారు. ఎమ్మార్వో సిబ్బంది, అభిమానులు బ‌న్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. యంగ్ టైగ‌ర్ ఇటీవ‌ల కాలంలో ఆరు ఎక‌రాల భూమిని శంక‌ర‌ప‌ల్లిలో కోనుగోలు చేశారు. ఇప్పుడు అక్క‌డే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు రెండు ఎక‌రాలు భూమిని కోనుగోలు చేయ‌డం విశేషం. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘పుష్ప ది రైజ్‌’ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 17న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌లవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mCPdvW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...