గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్. అదే సమంత- నాగ చైతన్య విడాకులు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ జోడీగా ఇన్నేళ్లు దాంపత్య జీవితం కొనసాగించిన ఈ ఇద్దరూ అకస్మాత్తుగా బ్రేకింగ్ న్యూస్ చెప్పడంతో అంతా షాకయ్యారు. ఇక నుంచి తాము స్నేహితులం మాత్రమే అని ఇద్దరూ ప్రకటించడంతో టాలీవుడ్ లోకంలో జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక ఈ ఇష్యూ గురించి వీలైనంత తొందరగా బయటకు రావాలనే ఉద్దేశంతో ఫాస్ట్ డెసీషన్ తీసుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపై తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే పెట్టాలని బలంగా ఫిక్స్ అయిందట సామ్. ఈ మేరకు ఇప్పటికే యాడ్ షూట్ ఫినిష్ చేస్తున్న ఆమె, మరికొద్ది రోజుల్లో వరుస ప్రాజెక్టులు లైన్‌లో పెట్టేయాలని డిసైడ్ అయిందట. వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూ విడాకుల ఇష్యూ తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాలని భావిస్తోందట. ప్రస్తుతం సమంత చేతిలో మూడు బడా ప్రాజెక్టులు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అవి ఏయే భాషలకు సంబంధించిన సినిమాలనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే మరో వారం రోజుల్లో ఆ మూడు ప్రాజెక్టులు అఫీషియల్‌గా ప్రకటించమని దర్శకనిర్మాతలను కోరిందట సామ్. ఆ మూడు ప్రాజెక్ట్స్ కూడా ఒకే రోజున ప్రకటించేలా సమంత ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' మూవీ ఫినిష్ చేసింది సమంత. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DBHuFB
v
No comments:
Post a Comment