Friday, 8 October 2021

ప్రమోషన్లలో వేగం పెంచిన ‘అన్నాత్తే’ టీమ్.. ఈ సారి హీరోయిన్‌తో కలిసి వస్తున్న రజనీ

తమిళ సూపర్‌స్టార్, తలైవర్ అంటే.. కేవలం తమిళనాడులోనే కాదు.. యావత్ భారతదేశ ప్రజలు ఇష్టపడతారు. ఆయన సినిమాలు విడుదల అవుతన్నాయి అంటే చాలు.. ఆ రోజు ఉండే కోలాహలం మామూలుగా ఉండదు. అయితే ఆయన చివరిగా ‘దర్బార్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఈ మధ్యలోనే కరోనా రావడం, లాక్‌డౌన్ పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే అన్ని ఆటంకాలను దాటుకొని సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్. దీంతో ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మాస్‌ లుక్‌లో రజనీకాంత్ సూపర్ అనిపించారు. కొద్ది రోజుల క్రితం ‘అన్నాత్తే.. అన్నాత్తే’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను పాడటం విశేషం. ఈ పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్.. బాలుకి నివాళులు అర్పించింది. రజనీ కూడా బాలుని గుర్తు చేసుకుంటూ.. భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సినిమా నుంచి ‘సారా కాట్రే’ అంటూ సాగే మరో పాటని శనివారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు.. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ఓ అద్భుతమైన ఉయ్యాలపై హీరోయిన్‌ సయనతారతో కలిసి రజనీ ఈ పోస్టర్‌లో మనకు కనిపిస్తున్నారు. ఇక ఈ పాటను ట్రెండింగ్ సింగర్లు సిద్ శ్రీరామ్, శ్రేయ గోషల్‌లు ఆలపించారు. ఇక సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కుష్బు, మీనా, , సూరి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FqEYn3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...