Tuesday, 5 October 2021

‘ఆ ముగ్గురు అంటే ఎంతో ఇష్టం’.. అసలు విషయం బయటపెట్టిన రాశీ ఖన్నా..

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా.. ముద్దుగుమ్మ . తొలి సినిమాతోనే ఈ భామ తన అందంతో ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. తెలుగుతో పాటు అటు తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తుంది ఈ సుందరి. దిల్లీకి చెందిన ఈ భామ.. ‘జోరు’, ‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’ తదితర సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ‘జై లవ కుశ’ సినిమా ద్వారా ఈ భామకు మరింత గుర్తింపు వచ్చింది. ఇక తమిళంలోనూ ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్‌ను సాధించాయి. అక్కడ కూడా ఆమె పలువురు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉండే రాశీ.. ఈ మధ్యకాలంలో చాలా స్లిమ్‌గా దాదాపు జీరో సైజ్‌కి వచ్చేసింది. ఇక సోషల్‌మీడియాలో రాశీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఆమె అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అయితే తెలుగులో తనకు ఇష్టమైన నటులు ఎవరు అనే ప్రశ్నకు హీరోలలో తనకు , అల్లు అర్జున్, మహేష్ బాబు ఇష్టమని.. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. అనుష్క, సమంత అంటే ఇష్టమని తెలిపింది. డ్యాన్స్‌‌లో అయితే డ్యాన్స్‌ తాను ఫ్యాన్‌ అని రాశీ పేర్కొంది. ప్రస్తుతం రాశీ తెలుగులో నాగ చైతన్యతో కలిసి ‘థాంక్యూ’, గోపిచంద్‌తో కలిసి ‘పక్కా కమర్షియల్’ సినిమాలు, తమిళంలో ‘అరణ్మనై 3’, ‘సర్దార్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు మరో మూడు తమిళ సినిమాలు కూడా ఆమె చేస్తోందని టాక్ వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BhBhxB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...