Tuesday, 5 October 2021

బతుకమ్మ పాట.. రెహమాన్ సారూ!! ఆ బీట్ ఏది ఆ జోష్ ఏది? విమర్శల దరువు

మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు, నాయ‌కురాలు క‌ల్ల‌కుంట్ల క‌విత చ‌రిత్ర సృష్టించారు. బ‌తుక‌మ్మ సాంగ్ కోసం ఇద్ద‌రు టాప్ టెక్నీషియ‌న్స్‌ను ఒక‌చోట చేర్చారు. వారి క‌ల‌యిక‌లో బతుక‌మ్మ సాంగ్‌ను రూపొందించారు. ఈ వీడియో సాంగ్‌ను గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ డైరెక్ట్ చేయ‌గా, ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందించారు. ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా భావించి క‌విత ఈ సాంగ్‌ను రెడీ చేసి విడుద‌ల చేశారు. ఎ.ఆర్.రెహమాన్ తన ట్విట్టర్లో ఈ పాటను షేర్ చేశారు. పాటను గమనిస్తే.. బతుకమ్మ పండుగకి తన ఫ్యామిలీతో కలిసి వ‌చ్చిన మ‌హిళ దారిలో త‌న చిన్న‌నాటి స్మృతుల‌ను గుర్తు చేసుకుంటుంది. త‌న కూతురికి చిన్న‌త‌నంలో త‌ను ఎలా బ‌తుక‌మ్మ ఆడేదో వివ‌రిస్తుంది. అక్క‌డ నుంచి ఆమె త‌న ఇంట‌కి వెళ్ల‌డం అక్క‌డ మ‌హిళ‌ల‌తో క‌లిసి బతుక‌మ్మ ఆడ‌టం ..ఇలా తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను చాలా రిచ్‌గా చిత్రీక‌రించారు. ‘‘అల్లిపూల వెన్నెల చెరువులోన కుర‌వ‌గా పూల ఇంధ్ర ధ‌న‌స్సులే నేల మీద నిల‌వ‌గా...’ అంటూ సాగే ఈ పాట‌లో తంగేడి పూలు, పుట్ట‌మ‌న్ను.. ఇలా తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాయాల గురించి వివ‌ర‌ణ క‌నిపిస్తుంది. ఈ బ‌తుక‌మ్మ పాటలో జోష్ ఉంటుంది. గ‌తంలో బతుక‌మ్మ బతుక‌మ్మ ఉయ్యాలో.. అంటూ సాగే పాట‌.. సింగ‌ర్ మంగ్లీ పాట మ‌రో పాట .. వంటి బ‌తుక‌మ్మ పాట‌ల‌ను విన్న‌ప్పుడు ఆ పాట‌ల్లో పండుగ‌లోని ఉత్సాహాన్ని తెలియ‌జేసేలా ఓ జోష్ క‌నిపిస్తుంది. కానీ, ఇప్పుడు గౌత‌మ్ మీన‌న్‌, ఎ.ఆర్‌.రెహ‌మాన్ కంపోజ్ చేసిన ఈ ‘అల్లిపూల వెన్నెల చెరువులోన కుర‌వ‌గా.. ’ అనే బతుక‌మ్మ సాంగ్‌లో ఆ జోష్ క‌నిపించ‌లేదు. ‘ఇదొక పాటనా..! బ‌తుక‌మ్మ పాట ఇలా ఉంటుందాండి. ఆ జోష్‌.. బీట్ ఎక్క‌డ‌, ఆస్కార్ అవార్డ్ అందుకున్న‌వాళ్లు ఇలాంటి సంగీతాన్ని అందింవచ్చా’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఏం సాంగ్ రా నాయనా..బతుకమ్మ పండగ మీదే విరక్తి వచ్చేలా ఉంది. ఈ మాత్రం దానికి ఎ.ఆర్.రెహమాన్, గౌతమ్ మీనన్ అవసరమా’ అని మరొకరు.. ‘తెలంగాణ ఆడియెన్స్ ప‌రంగా, తెలంగాణ మాస్ బీట్ మిస్స‌య్యింది..’ ‘తెలంగాణ యాస..సంగీతం మరోలా ఉంటుంది’ ఇలాంటి తరహాలో..నెటిజన్స్.. సోషల్ మీడియాలో బతుకమ్మ సాంగ్‌పై పెద‌వి విరుస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు వచ్చిన తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమైన బతుకమ్మ పాటలకు ఈ తరహా విమర్శలు రాలేదనే చెప్పాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uJwFO8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...