Saturday, 2 October 2021

అక్కినేని ఫ్యామిలీకే ఎందుకిలా?.. చైతూ, అఖిల్, నాగ్‌లకు చేదు అనుభవాలు!

నాగ చైతన్య విడాకుల ఇష్యూ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. విడాకుల రూమర్లను నిజం చేస్తూ సమంత, అధికారిక ప్రకటన చేసేశారు. ఇకపై భార్యభర్తలుగా ఉండలేమని, స్నేహితుల్లా కలిసి ఉంటామని ఇద్దరూ ప్రకటించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని అందరూ గౌరవిస్తారని, మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్టుగా సమంత, నాగ చైతన్య ఉమ్మడి ప్రకటన చేసేశారు. అయితే ఈ వ్యవహారంలో అంతా కూడా అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టేశారు. ఇక జీవితంలోనూ ఓ చేదు అనుభవం ఉంది. నాగ చైతన్య తల్లి లక్ష్మీతో విడాకులు, అమలతో ప్రేమాయణం పెళ్లి అనే విషయాలతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇక అఖిల్ విషయంలోనూ ఇలాంటి ఓ ఘటనే జరిగింది. ఎంతో అట్టహాసంగా అఖిల్ పెళ్లి చేయాలని అనుకున్న నాగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శ్రియా భూపాల్ అఖిల్ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో అఖిల్ నిశ్చితార్థం అలా ముగిసింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య వివాహా బంధం ఇలా ముగిసింది. అయితే సుమంత్ జీవితం కూడా అలానే ఉంది. కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. రెండేళ్లకే విడిపోయారు. అలా సుమంత్ కూడా ఇప్పుడు ఒంటరిగానే మిగిలాడు. ప్రస్తుతం అఖిల్ పెళ్లి ఆలోచనలు పక్కన పెట్టేసి కెరీర్ మీద దృష్టి పెట్టేశాడు. అయితే నాగ చైతన్య మదిలో ఎలాంటి ఆలోచనలున్నాయో తెలియడం లేదు. ప్రస్తుతం సినిమాల పరంగా నాగ చైతన్య థాంక్యూ, లాల్ సింగ్ చద్దాలతో బిజీగా ఉన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3A1lilR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...