Saturday, 2 October 2021

విడాకులపై అధికారిక ప్రకటన.. భయపడ్డ సమంత!.. అందుకే అలా చేసిందా?

నాగ చైతన్యల విడాకులపై గత నెల నుంచి వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ ఆ ఇద్దరూ అధికారికంగా ప్రకటన చేశారు. తామిద్దరం విడిపోతోన్నట్టు ప్రకటించేశారు. భార్యాభర్తలుగా విడిపోయినా కూడా తామిద్దరం స్నేహితుల్లానే ఉంటామని క్లారిటీ ఇచ్చారు. తమ బంధం ఏర్పడటానికి కారణం కూడా స్నేహమేనని, ఆ బంధం ఎప్పటికీ అలానే ఉంటుందని వారిద్దరూ పేర్కొన్నారు. అయితే సమంత మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించినట్టు అనిపిస్తోంది. సమంత తన విడాకుల విషయం మీద ప్రస్థావిస్తూ చేసిన అఫీషియల్ నోట్ కింద కామెంట్ల సెక్షన్లను కోజ్ చేసింది. మామూలుగా అయితే సమంత తన కామెంట్ల సెక్షన్లను క్లోజ్ చేయదు. ఎప్పుడో సారి నెగెటివ్ ట్రెండ్ జరిగిన సమయంలోనే అలా చేస్తుంటుంది. అయితే ఈ విడాకుల విషయంలో కచ్చితంగా నెగెటివ్ కామెంట్లు వస్తాయని ముందే ఆలోచించినట్టు కనిపిస్తోంది. అందుకే సమంత తన పోస్ట్‌కు కామెంట్లను డిజబుల్ చేసేసింది. అయితే ఈ పోస్ట్‌కు మాత్రం విపరీతమైన లైకులు వస్తున్నాయి. అంటే తీసుకోవాలని చాలా మంది ఎదురుచూస్తున్నారా? లేదా సమంత నాగ చైతన్యలు విడిపోయినా కూడా స్నేహితుల్లా ఉంటామని చెప్పినందుకు అలా లైక్స్ కొడుతున్నారా? లేక అసలు మ్యాటర్ చదవకుండానే లైకులు కొడుతున్నారా? అనే విషయం ఏమీ కూడా అర్థం కావడం లేదు. ఎన్నో సుధీర్ఘ చర్చల తరువాత మేం ఇద్దరం భార్యా భర్తలుగా విడిపోయి ఎవరి జీవితాలను వారే బతికేందుకు నిర్ణయించుకున్నామని ప్రకటించారు. గత దశాబ్దాలుగా మా మధ్య ఉన్న స్నేహబంధం ఇలానే కొనసాగుంది.. అది ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉంటుందని ఇరువురు పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3A36xik
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...