Tuesday, 5 October 2021

Bala Krishna: ఓటీటీలోకి నంద‌మూరి బాల‌కృష్ణ ఎంట్రీ.. సంచ‌ల‌న నిర్ణ‌యం వెనకున్న‌దెవ‌రు?

తెలుగు సినిమాల్లో నందమూరి హీరోలకు ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ సీనియ‌ర్‌. ఈ నంద‌మూరి అగ్ర క‌థానాయ‌కుడు నేటి త‌రం హీరోల‌కు సినిమాల పరంగానే కాదు, ట్రెండ్ ప‌రంగానూ పోటీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంథా మారుతుంది. ఇప్పుడు సినిమాల‌కుస‌మానంగా డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు ఆద‌ర‌ణ క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. పేరున్న చాలా డిజిట‌ల్ మాధ్య‌మాలు కోవిడ్ నేప‌థ్యంలో, థియేట‌ర్స్ అందుబాటులో లేన‌ప్పుడ‌యితే సినిమాల‌ను నేరుగా విడుద‌ల చేశాయి. ఇలా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో త‌న స్థానాన్ని పెంచుకుంటున్న డిజిట‌ల్ మాధ్య‌మంలోకి వెబ్ షోస్‌, వెబ్ సిరీస్‌ల ద్వారా చాలా మంది టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వారి బాట‌లోకి బాల‌కృష్ణ ఎంట్రీ ఇవ్వ‌నుండ‌టం విశేషం. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు మాధ్య‌మంగా ప్రారంభ‌మై తెలుగు ప్రేక్షకుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ .. మ‌న టాలీవుడ్ టాప్ స్టార్స్ త‌మ‌న్నా, స‌మంత, రానా వంటి వారితో షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను చేసింది. ఈ క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బాల‌కృష్ణ హోస్ట్ చేసిన తొలి సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూ త్వ‌ర‌లోనే ప్ర‌సారం అవుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. బాల‌కృష్ణ‌కు స‌న్నిహితులైన సినీ రంగ ప్ర‌ముఖులెంతో మంది ఈ టాక్‌షోలో పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం. స‌ద‌రు సెల‌బ్రిటీలు త‌మ‌కు బాల‌కృష్ణ‌తో ఉన్న అనుబంధాన్ని ఈ ఇంటర్వ్యూలో చెప్ప‌బోతున్నార‌ట‌. చాలా స‌ర్‌ప్రైజులున్నాయ‌ని కూడా స‌మాచారం. బాల‌కృష్ణ ఇంట‌ర్వ్యూలో మాట్లాడితేనే సంచ‌ల‌నం. మ‌రి.. ఆయ‌న హోస్ట్‌గా ఓ టాక్‌షోను ర‌న్ చేయ‌డం అంటే నంద‌మూరి అభిమానులు స‌హా అంద‌రిలో ఆస‌క్తిగొలిపేవిష‌య‌మే. తెలుగు ఓటీటీ ఆహా నిర్వాహ‌కుడైన అల్లు అర‌వింద్ ఈ షో వెనుక‌నున్నార‌ని, అందుకనే బాల‌కృష్ణ ఓకే చెప్పిన‌ట్లు టాక్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oB2wzI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...