Tuesday, 5 October 2021

సాయి ధరమ్ తేజ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక మెగా మేనల్లుడు రెడీ!! సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడంటే..

మెగా మేనల్లుడు రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఆయన అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. గత నెల 10వ తేదీన హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో వైద్య శిబిరాలు ఆయనకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తూ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. అయితే రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్.. ఆసుపత్రి నుంచి ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టడంతో ఆయన అభిమానుల్లో ఆశలు చిగురించాయి. తాను కోలుకుంటున్నట్టు స్వయంగా తెలియజేస్తూ, థంబ్ సింబల్‌తో ట్వీట్ చేసి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు సాయి ధరమ్ తేజ్. దీంతో త్వరలోనే ఆయన ఆసుపత్రి నుంచి బయటకు రానున్నారని అంతా ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో సినీ వర్గాల్లో వినిపిస్తున్న మరో వార్త సాయి తేజ్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం స్పీడ్‌గా రికవర్ అవుతోందని, నవంబర్ నుంచి ఆయన తదుపరి సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తన 15వ చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నారట సాయి తేజ్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానరర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరోవైపు దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ అక్టోబర్ 1న విడుదలై, హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ylo3kF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...