Thursday, 2 September 2021

సెప్టెంబర్ లో గ్రాండ్‌గా 'పోస్టర్' రిలీజ్.. తమ సినిమా అప్‌డేట్ ఇచ్చిన UFO

విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్లుగా శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ''. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను ప్రముఖ సంస్థ యూఎఫ్ఓ () గ్రాండ్‌గా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ''యూఎఫ్ఓ వంటి పెద్ద సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చిన్న సినిమాలలో ఒక పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా రిలీజ్‌లో మాకు ఎంతగానో సహకరిస్తున్న యూఎఫ్ఓ సంస్థ యాజమాన్యానికి, లక్ష్మణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు'' అన్నారు. హీరో విజయ్ ధరన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా మన ఊరిలో మన ఇంటి పక్కన , మన ఫ్రెండ్స్ మధ్య మనకి జరిగిన కథ లాగే ఉంటుంది. అన్ని ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. UFO సంస్థ భాగస్వామ్యం మా టీమ్‌కి మరింత ఎనర్జీ ఇచ్చింది'' అన్నారు. UFO సంస్థ నుండి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ''పోస్టర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్దంగా ఉంది. పరిస్థితులను పరిగణలోకి తీసుకుని త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం'' అన్నారు. ఈ చిత్రంలో శివాజీ రాజా, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాథ్, స్వప్నిక, అరుణ్ బాబు జగదిశ్వరి తదితరులు నటించగా శాండీ అద్దంకి సంగీతం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WMZ8pG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...