Thursday, 2 September 2021

PSPK 28 : సగమే కానీ కడుపునిండేలా.. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ అప్డేట్

పవర్ స్టార్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా వరుసగా అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్డేట్ల మోత మోగుతూనే ఉంది. ఉదయం భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ వచ్చేసింది. యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది. ఆ తరువాత హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సరికొత్త పోస్టర్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించేసింది హరిహర వీరమల్లు టీం. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న సినిమా అప్డేట్ ఇచ్చారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఆ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించారు. యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అంటూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. అంటూ ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న ఎట్టకేలకు అప్డేట్ వదిలింది. దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ నుంచి ఓ ప్రీ లుక్ వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్‌ను మొత్తంగా చూపించ లేదు. కానీ సగమే చూపించారు. ఆ సగం లుక్కుతోనే కడుపు ఫుల్లుగా నిండినట్టు అయింది. జాతర షురూ అంటూ చిత్రయూనిట్ ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే ఇకపై రచ్చ రచ్చే అన్నట్టు కనిపిస్తోంది. మళ్లీ ఫుల్లుగా లుక్కును రిలీజ్ చేస్తామని చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ పోస్టరర్ వెనకాల ఇండియా గేట్ ఉండటం చూస్తుంటే కథ ఢిల్లీలో జరిగేలా కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zF1G7M
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...