ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న శంకర్‌కు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదనే చెప్పాలి. సక్సెస్‌లు లేకపోవడమో లేక మరేదైనా కారణమో తెలియడం లేదు, కానీ.. శంకర్ చేయాలనుకుంటున్న సినిమాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఆయన కమల్ హాసన్‌తో స్టార్ట్ చేసిన ఇండియన్ 2 ఆగింది. రీసెంట్‌గానే నిర్మాణ సంస్థ లైకాతో చర్చలు సఫలం అయ్యాయి. మరో వైపు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్లడానికి శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆర్‌సీ 15గా దిల్‌రాజు, శిరీశ్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇండియ్ 2ను పూర్తి చేయకుండా ఆర్‌సీ 15ను స్టార్ట్ చేయకూడదని లైకా ఇప్పటకే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కుదరలేదు. అయితే త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ సినిమా విషయంలో డైరెక్టర్ శంకర్‌కు మరో షాక్ తగిలింది. అది కూడా కథ విషయం. వివరాల్లోకెళ్తే.. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసే చెల్లముత్తు చరణ్, శంకర్ చేయబోయే కథ తనదేనంటూ దక్షిణాది రచయితల సంఘానికి ఫిర్యాదు చేశాడు. నిజానికి శంకర్ హిందీలో చేయబోయే అపరిచితుడు రీమేక్‌తో బిజీగా ఉన్న సమయంలో చరణ్ సినిమా కోసం కథను తయారు చేయాల్సిందిగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌ను కోరాడట. ఆయన కూడా కథను సిద్ధం చేసి ఇచ్చాడట. అయిత కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథ తనదంటూ చెల్లముత్తు ఇప్పుడు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు దక్షిణాది రచయితల సంఘం అసలు నిజాన్నితెలుసుకునే పనిలో బిజీగా ఉంది. అనుకోని ఈ సమస్యను శంకర్ ఎలా అధిగమిస్తాడనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీకి తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. ఇందులో చరణ్‌ను ముఖ్యమంత్రి పాత్రలో శంకర్ చూపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ నటిస్తాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దిల్‌రాజు, శిరీశ్ నిర్మించబోయే 50వ చిత్రమిది. రీసెంట్‌గా చరణ్ తన ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసి, శంకర్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WRDp03
v
No comments:
Post a Comment