Friday, 3 September 2021

పవన్ కళ్యాణ్ బర్త్ డేపై ఆలస్యంగా విషెస్.. ఈ మాత్రం తెలియదా?.. నటి జ్యోతిపై ట్రోల్

నటి ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్జీవీతో వింతగా కుప్పి గంతులు వేసి, తాగిన మైకంలో చిందులు తొక్కిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. వీటిపై ఆర్జీవీ చేసిన కామెంట్లు, జ్యోతి ఇచ్చినా క్లారిటీ కూడా నెట్టింట్లో వైరల్ అయింది. మామా కళ్లు మామా అంటూ ఆర్జీవీ, జ్యోతి వేసిన స్టెప్పులు నెట్టింట్లో తెగ రచ్చ చేశాయి. ఆర్జీవీ లాంటి వారితో అలా చేయడం ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నానంటూ జ్యోతి చెప్పడంతో అందరూ కళ్లప్పగించేశారు. అయితే తాజాగా జ్యోతి మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. బర్త్ డే గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు అని ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది. అయితే జ్యోతి మాత్రం పవర్ స్టార్ బర్త్ డేను మరిచిపోయినట్టున్నారు. నిన్న చేయాల్సిన పోస్ట్ ఈ రోజు చేశారు. నిన్న చెప్పాల్సిన విషెస్‌ను నేడు చెప్పారు. అది కూడా పవన్ కళ్యాణ్ అఫీషియల్ ఖాతాలు ఏంటో కూడా తెలియకుండా ట్యాగ్ చేసేశారు. గుడుంబా శంకర్ సినిమాలో జ్యోతి కూడా నటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పక్కన జ్యోతి డ్యాన్స్ కూడా చేశారు. నాటి వీడియోను షేర్ చేస్తూ.. పవన్ కళ్యాణ్‌కు విషెస్ చెప్పారు జ్యోతి. అందులోనూ పవన్ కళ్యాణ్ ఖాతాను తప్పుగా జోడించారు. ఇక నిన్న బర్త్ డే అయితే ఈ రోజు ఎందుకు పెడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జ్యోతి మరోసారి ఇలా అందరికీ దొరికిపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YiWUyR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...