Friday, 3 September 2021

డ్రగ్స్ కేసులో వేలుపెట్టిన పూనమ్ కౌర్.. అన్నీ బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు

వేసే ట్వీట్లు, చేసే పోస్ట్లు ఎలా ఉంటాయి.. ఎంతటి వివాదానికి దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. తాజాగా పూనమ్ కౌర్ టాలీవుడ్ డ్రగ్స్ కేసులోకి ఎంట్రీ ఇచ్చారు. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న వాటిపై ఎంతో దిగులు చెందానని చెప్పుకొచ్చారు. దీనిపై కచ్చితంగా మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను.. కానీ అది ఎలానో తెలియదు.. వీడియో రూపంలో మాట్లాడతానో.. రాసి పెడతానో తెలియదు.. కానీ మాట్లాడటం మాత్రం ముఖ్యమని తెలుసు. కచ్చితంగా మాట్లాడతాను అంటూ పూనమ్ కౌర్ ఓ ట్వీట్ వేశారు. అలా వేసిన ఓ గంట తరువాతే అసలు విషయాన్ని చెప్పేశారు. డ్రగ్స్ సమస్యల గురించి పూనమ్ కౌర్ స్పందించారు. అసలే ఇప్పుడు టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు అల్లాడిస్తోంది. ఈడీ ఎంట్రీతో కథ మొత్తం మారిపోతోంది. మొన్న , నిన్న చార్మీ, నేడు రకుల్ ఇలా అందరినీ వరుసబెట్టి ఈడీ విచారిస్తోంది. ఈ క్రమంలో చాలా విషయాలే బయటకు రాబోతోన్నట్టు కనిపిస్తోంది. డ్రగ్స్ కొనుగోలు, మనీలాండరింగ్.. కెల్విన్ అప్రూవర్‌గా మారడం.. ఇలాంటి వాటిని పరిశీలిస్తే డొంక అంతా కదిలేలా ఉంది. ఇలాంటి సమయంలో పూనమ్ కౌర్ స్పందించడం, తన స్వీయ అనుభవాలు కూడా బయటకు చెబుతాను అంటూ పోస్ట్ చేయడంతోనే అసలు ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ అనేది కేవలం సెలెబ్రిటీల ఇష్యూ కాదు.. ఇది ప్రతీ ఒక్కరి సమస్య. ఇది దేశవిదేశాల సమస్య.. ఇది రాజకీయ సమస్య. ఇది మన దేశఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన ముప్పు వంటిది.. నేను ఈ విషయం మీద మాట్లాడతాను.. త్వరలోనే నా స్వీయ అనుభవాలను బయటపెడతాను అని పూనమ్ కౌర్ స్పందించారు. ఇక ఈమె ఏ విషయాలు బయటపెడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38C9hIa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...