Saturday, 4 September 2021

Raja Vikramarka : సరదా తీరిపోతోంది ఇంక నా వల్ల కాదు!.. అదరగొట్టిన కార్తికేయ

ఆర్ ఎక్స్ 100 హీరో ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నారు. సినిమాలు అంతగా ఆడకపోయినా కూడా ఆఫర్లు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. ఇక విలన్‌గానూ కార్తికేయ మెప్పించారు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో కార్తికేయ విలన్‌గా మారిపోయారు. ఇక అజిత్ వలిమై చిత్రంలోనూ నెగెటివ్ రోల్ చేస్తున్నారు. అలా నెగెటివ్ పాత్రలు పోషిస్తూ.. ఇటు హీరోగానూ దుమ్ములేపుతున్నారు. తాజాగా ఆయన నటించిన సినిమా నుంచి టీజర్ బయటకు వచ్చింది. కాసేపటి క్రితమే టీజర్‌ను వదిలారు. రాజా విక్రమార్క చిత్రంలో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించబోతోన్నారు. చిన్నప్పుడు సూపర్ స్టార్ క‌ృష్ణ, పెద్దయ్యాక టామ్ క్రూజ్ చిత్రాలను చూసి బాగానే ఇన్‌స్పైర్ అయి అలాంటి జాబ్ ఎంచుకున్నటున్నాడు మన హీరో విక్రమ్. కానీ సరదా తీరిపోతోంది.. ఇంక నా వల్ల కాదు అని చేతులెత్తేసినట్టు మనకు టీజర్‌లో కనిపిస్తోంది. ఇంతకీ మన హీరోకు అంత కష్టం ఎందుకు వచ్చిందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే టీజర్ విడుదల చేసిన వరుణ్ తేజ్.. హీరో కార్తికేయ సినిమా ఎంపికల పట్ల సంతోషాన్ని, ప్రేమను వ్యక్తం చేశారు. కార్తికేయ హీరోగా తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం రాజా విక్రమార్క. ఈ మూవీని రామా రెడ్డి తెరకెక్కిస్తుండగా.. శ్రీ సారిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, తనికెళ్ల భరణి, పశుపతి, హర్ష వర్దన్, సుధాకర్ కొమాకుల, సూర్య, జెమినీ సురేష్ వంటి వారు నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kS65hl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...